కోలీవుడ్( Kollywood ) లోనే అత్యంత స్పెషాలిటీ ఉన్న జంటగా గుర్తింపు దక్కించుకున్నారు హీరో అజిత్( Ajith ) మరియు అతడి భార్య షాలిని.చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించి, హీరోయిన్ గా ఎదిగి సినిమాల్లో నటిస్తున్న క్రమం లో హీరో అజిత్ తో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది షాలిని.
ఈ జంటకు ఒక కూతురు మరియు ఒక కుమారుడు కూడా ఉన్నారు.మీడియా కు, సోషల్ మీడియా కు చాల దూరం గా ఉంటూ ఎంతో లో ప్రొఫైల్ మైంటైన్ చేస్తూ ఉంటారు.
అయితే ఒక ఇంటర్వ్యూ లో అజిత్ తన భార్య గురించి చాల గొప్పగా చెప్పాడు.తన భార్య షాలిని( Shalini ) వయసుకు మించిన మెచ్యూరిటీ కలిగి ఉంటుందని, ఆమె ఆలోచన విధానం ఎంతో బాగుంటుందని చెప్పారు.

ప్రతి కుటుంబం లో సమస్యలు వచ్చినట్టే మా ఫ్యామిలి లో కూడా వస్తాయని, కానీ మేము ఒకరిని ఒకరం బాగా అర్ధం చేసుకుంటామని, అలాగే ఎవరికీ కావాల్సిన స్పేస్ వాళ్లకు ఇస్తామని, అందువల్ల సమస్యలు పెద్దగా అవ్వమంటూ చెప్పుకోచ్చారు.అలాగే ప్రతి ఒక్కరు కూడా ఏదైనా గొడవ జరిగినప్పుడు అవతల వారికి అర్ధం చేసుకోవడానికి కావాల్సిన టైం ఇవ్వాలని, లేకపోతే అవి అపర్దాలుగా మారి సమస్యలు పెరిగి పెద్దవి అవుతాయని, కొన్ని సార్లు విడాకులకు దారి తీస్తాయని చెప్పారు.ఇలాంటి విషయాలలో నేను అదృష్టవంతుడిని అని షాలిని లేకపోతే తన జీవితం ఇంత అందంగా ఉండేది కాదని, ఖచ్చితంగా ఆమె నా భాగస్వామి కావడం తన అదృష్టం అంటూ చెప్పుకోచ్చారు.

సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన వారిలో ఇలా అర్ధం చేసుకొనే భాగస్వామి దొరకడం చాల కష్టం.కానీ అజిత్ లాంటి ఒక స్టార్ హీరో కి భార్య గా షాలిని తన పాత్రా ఎంతో సమర్ధవంతంగా పోషిస్తుంది.పిల్లల విషయంలో అజిత్ కుటుంబం పై కూడా ఆమె అమితమైన గౌరవం, శ్రద్ధ వహిస్తారని చాల మంది చెప్తూ ఉంటారు.
ఇలా అందరి జీవితాల్లో అర్ధం చేసుకునే భార్య వస్తే అది ఎంతో సుఖవంతమైన కుటుంబం అవుతుంది.నిజానికి అజిత్ కూడా తన భార్య షాలిని మంచి రెస్పెక్ట్ ఇస్తారు.
అందువల్లే చాల మంది కన్నా వీరి జీవితం హాయిగా ఉంది.