15 సెకండ్లలోనే కరోనా అంతం... ఎలా అంటే?

గత కొద్ది నెలల నుంచి యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి కేవలం ఒకరి నుంచి మరొకరికి వ్యాపించడమే కాకుండా అనేక రకాల వస్తువులపై జీవించి ఇది మనుషులకు వ్యాపిస్తుందని ఇదివరకు శాస్త్రవేత్తలు తెలియజేశారు.అయితే ప్రస్తుతం కరోనా కేసులు కొంతమేర తగ్గినప్పటికీ, మనం ఏమాత్రం అశ్రద్ధ వహించిన తిరిగి ఈ మహమ్మారి విజృంభించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

 Corona Ends In 15 Seconds How Come Corona Virus, Seconds, State Innovation Cell,-TeluguStop.com

ఈ మహమ్మారి కి వాక్సిన్ కనుగొనే ప్రయత్నంలో వివిధ దేశాల శాస్త్రవేత్తలు నిమగ్నమై ఉన్నారు.ఇప్పటికే కొన్ని దేశాలు ఈ వ్యాక్సిన్ ను వాలంటీర్ల పై ప్రయోగం నిర్వహించారు.

అయితే వాటి వల్ల కొన్ని దుష్పరిణామాలు ఏర్పడే ప్రభావం ఉందని భావించిన నిపుణులు కరోనా మహమ్మారికి సమర్థవంతమైన వాక్సిన్ కోసం ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి.

కరోనా వైరస్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే వరకు ప్రజలందరూ ఎంతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.అయితే ఈ వైరస్ ను కొంతమేర కట్టడి చేయడానికి తెలంగాణకు చెందిన యువ శాస్త్రవేత్తలు ఓ వినూత్న ఆవిష్కరణ చేశారు.మండాలి నర్సింహాచారి అనే శాస్త్రవేత్త ఫిలమెంట్ అవసరం లేని అధిక తీక్షణతో కూడిన అతినీలలోహిత కిరణాలు వెలువడే ఓ యంత్రాన్ని కనుగొన్నారు.

ఈ యంత్రం వస్తువు ఉపరితలంపై ఉన్న వైరస్ ను కేవలం 15 సెకండ్లలో అంతం చేస్తుంది.ఈ యంత్రం ద్వారా ఎటువంటి సూక్ష్మజీవులనైనా అంతం చేయవచ్చని నర్సింహాచారి తెలిపారు.

ఈ యంత్రాన్ని పరిశీలించిన సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ,నర్సింహాచారితో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు.అంతేకాకుండా స్టేట్‌ ఇన్నొవేషన్‌ సెల్‌ తన ఈ పరిశోధనకు సహకారం అందించిందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.

ఈ పరికరం ఉపయోగించి కూరగాయలు వంటి వాటిపై ఉన్న వైరస్ లను ఈజీగా అంతం చేయవచ్చని యువ శాస్త్రవేత్త నరసింహాచారి తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube