దీపావళి పండుగ రోజు మన దేశంలో చాలామంది ప్రజలు తమ కుటుంబంతో పాటు సంతోషంగా దీపాలు వెలిగించి పండుగను జరుపుకుంటూ ఉంటారు.అంతేకాకుండా ఈ పండుగ సమయంలో పూజలు, ఉపవాసాలు, నోములు చేస్తూ గ్రహ దోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతూ ఉంటారు.
ఇలా చేయడం వల్ల ఈ గ్రహ దోషాలు పూర్తిగా తొలగిపోకపోయినా కాస్త ఉపశమనం కలిగే అవకాశం ఉందని పెద్దవాళ్ళ నమ్మకం.మామూలుగా అయితే శని దోషం తొలగించుకోవడానికి శనివారం ఆలయానికి వెళ్లి నవగ్రహాలకు తైలాభిషేకం చేయడం మంచిది.
నువ్వులు దానం చేయడం ఇలా ఎన్నో రకాల పద్ధతులను ఫాలో అవుతారు.ఇలాంటి వాటిలో దీపావళి పండుగకు వెలిగించే నువ్వుల దీపం కూడా ఒకటి.
దీపావళి పండుగ రోజు ఇలా నువ్వుల దీపం వెలిగించడం వల్ల శని దోషం పూర్తిగా తొలగకపోయినా కాస్త ఉపశమనం ఉంటుంది.దీపావళి పండుగ రోజు ఉదయాన్నే తలస్నానం చేసి మూడు గుప్పెడల నల్ల నువ్వులు ఓ తెల్లటి గుడ్డలో మూట కట్టాలి.
ఒత్తి ఆకారంలో వచ్చేలా మూట కట్టి నువ్వుల నూనెలో నానబెట్టి, దీపావళి రోజు సాయంత్రం ఇంట్లో లక్ష్మీపూజ చేసిన తర్వాత తులసికోట దగ్గర దివ్వ కొట్టి ఇంట్లోకి వచ్చాక బయట దీపాలు పెట్టుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి.

అన్ని పనులు పూర్తయ్యాక ఇక ఇంట్లోకి వెళ్లిపోవడమే అనే సమయంలో ఈ నువ్వుల దీపాన్ని వెలిగించడం మంచిది.ఇది కొన్ని ప్రాంతాల వారు చేస్తారు కొన్ని ప్రాంతాల వారు చేయరు.పట్టణాలలో ఉన్నవారైతే ఇంటి గేటు బయట ఓ మూలగా వెలిగించి వెనక్కు తిరిగి చూడకుండా కాళ్లు కడుక్కుని ఇంట్లోకి వెళ్లిపోవాలి.
మూట కట్టిన నువ్వులన్నీ మసైపోయే వరకూ దీపం వెలిగేలా కర్పూరం పొడి లాంటివి కూడా దానిపై వేయొచ్చు అని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతారు.
DEVOTIONAL