ఆచార్య డిజాస్టర్...గాడ్ ఫాదర్ తో హిట్ కొట్టిన చిరు... మరి కొరటాల సంగతేంటి?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు మెగాస్టార్ చిరంజీవి.అలాగే రచయితగా ఇండస్ట్రీలో పేరుపొందిన కొరటాల శివ అనంతరం మిర్చి సినిమాతో దర్శకుడిగా మారారు.

 Acharyas Disaster Chiru Hit With Godfather And What About Koratala, Acharya's Di-TeluguStop.com

ఇలా అపజయం ఎరుగని దర్శకుడిగా ఇండస్ట్రీలో పేరు సంపాదించుకున్న కొరటాల దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరూ కలిసి ఆచార్య సినిమాలో నటించారు.అయితే ఈ సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నప్పటికీ ఈ సినిమా మాత్రం డిజాస్టర్ గా నిలిచింది.

ఇక ఈ సినిమా డిజాస్టర్ కావడానికి పూర్తిగా కొరటాలే కారణమంటూ పరోక్షంగా చిరంజీవి ఎన్నోసార్లు వెల్లడించారు.

ఇకపోతే కొరటాల సినిమా దర్శకత్వం విషయంలో మెగాస్టార్ ప్రమేయం కూడా ఉందని అందుకే సినిమా రిజల్ట్ ఇలా ఉందని మరో వాదన కూడా ఇండస్ట్రీలో ఉంది.

ఇకపోతే ఆచార్య సినిమా ఫ్లాప్ కావడంతో ఎన్నోసార్లు ఈ సినిమా ఫ్లాప్ గురించి చిరంజీవి ప్రస్తావించడమే కాకుండా చరణ్ తాను ఇద్దరు కలిసి ఏకంగా 100% రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చామంటూ తాజాగా గాడ్ ఫాదర్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో తెలియజేశారు.ఆచార్య వంటి డిజాస్టర్ సినిమా తర్వాత చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

Telugu Chiru, Godfather, Koratala-Movie

ఈ సినిమాతో అద్భుతమైన హిట్ తన ఖాతాలో వేసుకోవడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబడుతోంది.ఆచార్య వంటి డిజాస్టర్ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఎంతో మంచి విజయాన్ని అందుకున్నారు.ఇకపోతే ఈ సినిమా తర్వాత కొరటాల శివ ఎటు తేల్చుకోలేకపోతున్నారు.ఆచార్య సినిమా తర్వాత కొరటాల శివ ఎన్టీఆర్ సినిమాని ప్రకటించారు.ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన మోషన్ పోస్టర్ కూడా విడుదల చేశారు.అయితే ఈ సినిమా కొరటాలకు నిజంగానే ఒక అగ్నిపరీక్ష లాగా ఉంది.

ఈ సినిమా ఎలాగైనా హిట్ కొడితేనే కొరటాలకు ఇండస్ట్రీలో మనుగడ ఉంటుందని లేకపోతే ఈయన ఇండస్ట్రీలో కొనసాగడం కష్టతరమవుతుందంటూ పలువురు భావిస్తున్నారు.మరి కొరటాల ఎన్టీఆర్ సినిమాతో హిట్టు కొడతారా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube