ఆరోగ్యానికి మేల‌ని రాగులు తింటున్నారా? అయితే ఇవి తెలుసుకోండి!

రాగులు.దక్షిణ భారతదేశంలో విరి విరిగా ఉప‌యోగించే ధాన్యాల్లో ఇవి ఒక‌టి.రాగుల‌తో ఎన్నో వంట‌లు త‌యారు చేస్తుంది.రాగిసంకటి, రాగి జావ‌, రాగి ఉప్మా, రాగి దోస‌, రాగి ఇడ్లీ, రాగి మురుకులు, రాగి ల‌డ్డు ఇలా రాగుల‌తో అనేక రుచిక‌ర‌మైన వంట‌లు చేస్తుంటారు.

 Side Effects Of Finger Millet, Finger Millet, Benefits Of Finger Millet, Finger-TeluguStop.com

రాగుల‌తో ఏ వంట చేసినా.రుచి అద్భుతంగా ఉంటుంది.అలాగే రాగుల్లో కాల్షియం, మెగ్నీషియం, ఐర‌న్‌, ఫాస్ప‌ర‌స్‌, పొటాషియం, సోడియం, జింక్‌, ప్రోటీన్‌, విట‌మిన్ బి, కార్బో హైడ్రేట్స్, పీచు పదార్ధాలు, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైటో కెమికల్స్ ఇలా బోలెడ‌న్ని పోష‌కాలు కూడా నిండి ఉంటాయి.

అందు వ‌ల్లే, రాగులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.ముఖ్యంగా శ‌రీర వేడిని చ‌ల్లార్చ‌డంలోనూ, బ్ల‌డ్ షుగ‌ర్ లెవ‌ల్స్‌ను అదుపు చేయ‌డంలోనూ, అధిక బ‌రువును నియంత్రించ‌డంలోనూ, గుండె సంబంధిత సమస్యలు తగ్గించడంలోనూ, ర‌క్త హీనత‌ను నివారించ‌డంలోనూ, చ‌ర్మాన్ని య‌వ్వ‌నంగా ఉండేలా చేయ‌డంలోనూ రాగులు అద్భుతంగా స‌హాయ‌ప‌డ‌తాయి.

అయితే రాగులు ఆరోగ్యానికి ఎంత మంచి చేసిన‌ప్ప‌టికీ.

వాటిని అతిగా తీసుకుంటే మాత్రం అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది.ముఖ్యంగా ప‌రిమితికి మించి రాగులు తిన‌డం వ‌ల్ల మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్ప‌డే అవ‌కాశాలు పెరిగి పోతాయి.

ఒక వేళ కిడ్నీలో రాళ్లు ఉన్న వారు రాగులు అధికంగా తీసుకుంటే.స‌మ‌స్య మ‌రింత తీవ్ర త‌రంగా మారుతుంది.

అలాగే రాగుల‌ను ఓవ‌ర్‌గా తీసుకోవ‌డం వ‌ల్ల‌.అందులో ఉండే గోట్రోజెన్ థైరాయిడ్ హార్మోన్ ఉత్ప‌త్తికి అంత‌రాయాన్ని క‌లిగిస్తుంది.దాంతో థైరాయిడ్ స‌మ‌స్యను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది.ఇక ఈ వ‌ర్షా కాలంలో రాగుల‌కు దూరంగా ఉండ‌ట‌మే మంచిది.రాగులు శ‌రీరానికి చ‌లువ చేస్తాయి.వ‌ర్షా కాలంలో చ‌లువ చేసే ఆహారాలు అధికంగా తీసుకుంటే.

అనేక స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube