కోరిన కోర్కెలు తీర్చే కాణిపాకం వరసిద్ధి వినాయకుడు!

చిత్తూరు జిల్లా కాణి పాకంలో వెలసిన వరసిద్ధి వినాయకుడు… భక్తులు కోరిన కోరికలు తీరుస్తాడని ప్రతీతి.అలాగే సత్య ప్రమాణాలు దేవుడిగానూ ప్రసిద్ధికెక్కాడు.

 Kanipakam Vara Siddhi Vinayaka Special Story , Devotional, Kanipakam Vinayakudu-TeluguStop.com

స్వామి వారి ఎదుట ఎవరైనా తప్పుడు ప్రమాణం చేస్తే.వారిని ఆ గణనాథుడు కఠినంగా శిక్షిస్తాడని భక్తుల నమ్మకం.

అంతే కాదండోయ్ వ్యసన పరులు ఆ దేవుడి ముందు ప్రమాణం చేస్తే… దురలవాట్లకు పూర్తిగా దూరం అవుతారట.వెయ్యి ఏళ్ల చరిత్ర ఉన్న ఆలయంలో వరిసిద్ధి వినాయకుడు నిత్యం పెరుగుతున్నాట.అందుకు ప్రత్యక్ష నిదర్శనం కూడా ఉంది.50 సంవత్సరాల కిందట వినాయకుడికి వెండి కవచం చేయించారట.అది తర్వాత కొన్నాళ్ల తర్వాత నుంచి సరిపోవడం లేదు.భక్తులంతా కలిసి మళ్లీ 2002 సంవత్సరంలో మరో వెండి కవచాన్ని స్వామి వారికి విరాళంగా ఇచ్చారు.ప్రస్తుతం అది కూడా స్వామి వారికి పట్టట్లేదు.స్వామి వారు రోజూ పెరుగుతున్నారనడానికి ఇదే నిదర్శనం.

స్థల పురాణం.

సుమారు వెయ్యేళ్ల కిందట ఈ ఆలయ నిర్మాణం జరిగినట్లు ఆధారాలున్నాయి.

పూర్వం విహారపురి అనే గ్రామంలో ధర్మాచరణ పరాయణులైన ముగ్గురు గుడ్డి, మూగ, చెవిటి వాళ్లుగా జన్మించారు.వారు పొలాన్ని సాగు చేసుకుంటూ జీవించేవారు.

అయితే ఒక సారి గ్రామంలో విపరీతమైన కరువు ఏర్పడిందట.కనీసం తాగేందుకు గుక్కెడు మంచి నీళ్లు కూడా దొరకలేవట.

ఎలాగైనా సరే కరువును జయించాలని ఆ ముగ్గురూ కలిసి తమ పొలంలో ఉన్న బావిని మరింత తవ్వడం ప్రారంభించారు.చాలా లోతు వరకు వెళ్లాక ఏదో పెద్ద బండరాయి అడ్డుగా తగిలిందట.

దానిపై గునపంతో కొట్టగా రక్తం చిమ్మిందట.ఆ రక్తం తాకిన ఈ ముగ్గురుకి వైకల్యం తొలిగిపోయిందట.

అదే విషయం ఊళ్లోకి వెళ్లి చెప్పగా… గ్రామస్థులంతా కలిసి పూర్తిగా బావిని తవ్వగా స్వామి వారు బయటపడ్డారు.అప్పటి నుంచి ఇప్పటి వరకు స్వామి వారికి పూజలు చేస్తూనే ఉన్నారు.

కోరిన కోరికలు తీరడంతో భక్తుల రాక ఎక్కువై.దేశమంతటా వ్యాపించింది.

అలా ఈ ఆలయం ప్రసిద్ధికెక్కింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube