Tanuj Virwani: కమల్ హాసన్ కూతుర్ని ప్రేమించి మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్న నటుడు..!!

సినిమా ఇండస్ట్రీలో ఒకరిని ప్రేమించి మరొకరిని పెళ్లి చేసుకోవడం అనేది సర్వసాధారణం.అయితే ఇది కేవలం సినిమా ఇండస్ట్రీలోనే కాదు సమాజంలో ఎక్కడైనా ఇలాగే జరుగుతుంది.

 Actor Tanuj Virwani Who Loves Kamal Haasan Daughter Akshara Haasan And Marries-TeluguStop.com

ఒక ఇద్దరు చాలా సంవత్సరాలు ప్రేమించుకున్నా సరే పెళ్లి చేసుకుని సమయానికి వారిద్దరి మధ్య మనస్పర్ధలు ఉంటే కచ్చితంగా మళ్ళీ వారికి బ్రేకప్ చెప్పి వేరే అబ్బాయిని లేదా అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కామన్.అయితే తాజాగా ఒక తెలుగు హీరోయిన్ కొడుకు సినిమాల్లో నటుడి గా రాణిస్తున్న ఆయన కమల్ హాసన్ కూతుర్ని ప్రేమించి చివరికి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడు.

మరి ఇంతకీ ఆయన ఎవరు.ఎందుకు కమల్ హాసన్ (Kamal haasan) కూతుర్ని వదిలేసి వేరే అమ్మాయిని చేసుకుంటున్నారు అనే సంగతి ఇప్పుడు తెలుసుకుందాం.

తనూజ్ విర్వాని(Tanuj Virwani).తెలుగు హీరోయిన్ కొడుకు అయినప్పటికీ బాలీవుడ్ లో రెండు మూడు సినిమాలు చేసి అంతగా గుర్తింపు రాకపోవడంతో ఆ ఇండస్ట్రీని వదిలేశారు.కానీ ఈయన నటించిన ది ఇన్సైడ్ ఎడ్జ్ అనే వెబ్ సిరీస్ ఓటిటి లో విడుదలై ఓవర్ నైట్ లో స్టార్ గా మారారు.నటుడుగా మోడల్ గా ఉన్న తనూజ్ విర్వాని తెలుగు హీరోయిన్ అయినా రతి అగ్నిహోత్రి(Rathi Agnihotri) కొడుకు.

Telugu Akshara Haasan, Balakrishna, Chiranjeevi, Izabelle, Kamal Haasan, Rathi A

ఈమె అప్పట్లో బాలకృష్ణ తో డిక్టేటర్ సినిమాలో నటించడమే కాకుండా చిరంజీవి (Chiranjeevi) పున్నమినాగులో కూడా కనిపించింది.అయితే ఈ హీరోయిన్ కొడుకు తనూజ్ విర్వాని నాలుగు సంవత్సరాలు కమల్ హాసన్ చిన్న కూతురు అక్షర హాసన్ (Akshara Haasan) తో ప్రేమలో ఉన్నారు.కానీ వీరిద్దరి మధ్య ఎందుకు బ్రేకప్ జరిగిందో తెలియదు కానీ ఆ తర్వాత వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో విజయ్ దేవరకొండ తో కలిసి చేసిన ఇజ్బెల్లా తో కూడా డేటిం** రూమర్స్ వినిపించాయి.

Telugu Akshara Haasan, Balakrishna, Chiranjeevi, Izabelle, Kamal Haasan, Rathi A

అయితే వీరందరినీ పక్కన పెట్టి ప్రస్తుతం తాన్య జాకబ్ (Tanya Jakob) అనే అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు.ఇక సడన్గా తన సోషల్ మీడియా ఖాతాలో ఎంగేజ్మెంట్ కి సంబంధించిన ఫోటోలు పెట్టి అందరికీ షాక్ ఇచ్చారు.ఇక త్వరలోనే ఈ హీరో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube