సర్కారు వారి పాట.. పోటీ పడుతున్న ప్లాప్‌, హిట్‌ ట్రెండ్స్

మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా ఇటీవలే విడుదల అయ్యింది.మహేష్ బాబు గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ సినిమా తో భారీ గా వసూళ్లను దక్కించుకుంటున్నాడు అంటూ ఒక వర్గం మీడియా వారు తెగ ఉదరగొట్టేస్తున్నారు.

 Mahesh Babu Sarkaru Vaari Paata Movie Social Media Talk  ,  Keerthy Suresh ,  Ma-TeluguStop.com

మరో వైపు సర్కారు వారి పాట యొక్క వసూళ్లను కొందరు ఫేక్ అంటూ విమర్శలు చేస్తున్నారు.సినిమా విడుదల అయిన మొదటి రోజే సినిమా డిజాస్టర్‌ అంటూ ట్విట్టర్ లో హ్యాష్ ట్యాగ్‌ తో ట్రెండ్ చేసిన విషయం తెల్సిందే.

జాతీయ స్థాయిలో మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా డిజాస్టర్‌ అనే హ్యాష్‌ ట్యాగ్‌ ట్రెండ్‌ అయ్యింది.అదే ట్రెండ్‌ కొనసాగితే సినిమా దారుణమైన పరాజయం పాలయ్యేది.

కాని మైత్రి మూవీ మేకర్స్ వారు సినిమాను బాగా ప్రమోట్ చేశారు.సినిమా విడుదల తర్వాత కూడా వారి యొక్క డెడికేషన్‌ ను ఉపయోగించి అద్బుతంగా సినిమా ను ప్రమోట్‌ చేసిన తీరు అభినందనీయం అనడంలో సందేహం లేదు.

ఒక వైపు డిజాస్టర్‌ టాక్ ను విస్తరించేందుకు అందరు ప్రయత్నిస్తూ ఉంటే సర్కారు వారి పాట సినిమాబాగుంది అంటూ మైత్రి మూవీ మేకర్స్ వారు వరుసగా ప్రెస్‌ మీట్‌ లు పెట్టి.వసూళ్లను వెళ్లడిస్తూ కుమ్మేస్తుంది అంటూ అందరికి నిరూపించే ప్రయత్నం చేశారు.

మొత్తానికి సినిమా సక్సెస్ అయ్యినట్లే ఉంది అని మైత్రి మూవీ మేకర్స్ వారి కలెక్షన్స్ పోస్టర్స్ చూస్తుంటే అనిపించేలా ప్రమోషన్ చేశారు.సినిమా ను అద్బుతంగా వారు ప్రమోట్ చేసిన విధానంపై మహేష్ బాబు స్పందించాడు.

వారి వల్లే సర్కారు వారి పాట నిలిచింది.వారు కాకుండా మరెవ్వరైనా కూడా సినిమా కుప్పకూలేది అన్నట్లుగా మీడియా వర్గాల వారు కూడా చర్చించుకుంటున్నారు.

ఎంతగా అయితే నెగటివ్‌ టాక్‌ ను ప్రచారం చేయాలని చూశారో.వారికి కౌంటర్‌ అన్నట్లుగా మైత్రి మూవీ మేకర్స్ వారు పాజిటివ్‌ గా టాక్‌ ను ప్రచారం చేయడం జరిగింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube