ఈ రోజు పంచాంగం ( Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 6.26
సూర్యాస్తమయం: సాయంత్రం.6.27
రాహుకాలం: ఉ.10.30 మ12.00
అమృత ఘడియలు: ఉ.9.43 ల10.13 సా4.43 ల 4.45
దుర్ముహూర్తం: ఉ.8.24 ల9.12
మ.12.28 ల1.12
మేషం:

ఈరోజు పాత విషయాలు జ్ఞప్తికి తెచ్చుకుంటారు.చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది.దీర్ఘకాలిక సమస్యలు తీరి మానసిక ప్రశాంతత పొందుతారు.
నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు.ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు.
వృషభం:

ఈరోజు మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.తొందరపడి మీ వ్యక్తిగత విషయాలని ఇతరులతో పంచుకోకండి.నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి ఈరోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంది.చాలా సంతోషంగా ఉంటారు.
మిథునం:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి వస్తుంది.ఖర్చులు ఎక్కువగా చేయకూడదు.ఇంటికి బంధువులు వస్తారు.వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.
కర్కాటకం:

ఈరోజు వృత్తి వ్యాపారాలలో భాగస్వాములతో సఖ్యత కలుగుతుంది.నూతనోత్సాహంతో కొన్ని కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు.గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు.నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు.ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.
సింహం:

ఈరోజు సమాజంలో విశేషమైన గౌరవ మర్యాదలు పెరుగుతాయి.మానసికంగా ప్రశాంతంగా ఉంటారు.బంధు మిత్రుల నుండి కీలక సమాచారం అందుతుంది.
వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు అందుతాయి.వృత్తి ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.
కన్య:

ఈరోజు స్థిరాస్తి వ్యవహారంలో బంధువుల నుండి అందిన ఒక వార్త ఆనందం కలిగిస్తుంది.కుటుంబ సభ్యులతో గృహమున ఆనందంగా గడుపుతారు.సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.క్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు.ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది.
తుల:

ఈరోజు దూరపు బంధువుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి.ఆర్థిక పరిస్థితి మరింత అనుకూలంగా ఉంటుంది.వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.
ముఖ్యమైన వ్యవహారాలలో మరింత జాగ్రత్తగా ముందుకు సాగడం మంచిది.నిరుద్యోగుల ప్రయత్నాలు కలసివస్తాయి.
వృశ్చికం:

ఈరోజు స్ధిరాస్తి విషయంలో సోదరులతో నూతన ఒప్పందాలు కుదురుతాయి.ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు కలుగుతాయి.ఆర్థిక వ్యవహారాలు కలసివస్తాయి.వాహన యోగం ఉన్నది.వృత్తి ఉద్యోగాలలో సమయపాలనతో పనులు పూర్తి చేస్తారు.
ధనుస్సు:

ఈరోజు కుటుంబ సభ్యులకు మీ ప్రవర్తన నచ్చదు చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు.బంధు మిత్రులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.చిన్ననాటి మిత్రుల నుండి ఆహ్వానాలు అందుతాయి.
ఆరోగ్య విషయాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి.వ్యాపార విస్తరణ ప్రయత్నాలలో అవరోధాలను అధిగమిస్తారు.
మకరం:

ఈరోజు ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.మిత్రులతో కలిసి కష్టసుఖాలు పంచుకుంటారు.గృహనిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.దూర ప్రాంత సన్నిహితుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.ఆకస్మిక ధన లాభం ఉన్నది.
కుంభం:

ఈరోజు మీరు అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.ప్రయాణాల్లో కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.కొన్ని నూతన వస్తువులను కొనుగోడు చేయకపోవడం మంచిది.
నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.చాలా ఉత్సాహంగా ఉంటారు.
మీనం:

ఈరోజు కొన్ని సమస్యలు నుండి సోదరుల సహాయంతో బయటపడతారు.క్రయ విక్రయాలలో విశేష లాభాలు అందుకుంటారు.చేపట్టిన వ్యవహారాలలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు.మొండి బకాయిలు వసూలవుతాయి.ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.