వైసీపీపై టీడీపీ నేత బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇటీవల విశాఖ ఎయిర్ పోర్టు ఘటనపై స్పందించిన ఆయన వైసీపీకి అంతిమ ఘడియలు దగ్గర పడ్డాయని చెప్పారు.
విశాఖలో జనసేన నాయకులు హుందాగా వ్యవహరించారని అన్నారు.కానీ వైసీపీ మంత్రులే జనసేన కార్యకర్తలు, నేతలను రెచ్చ గొట్టారని ఆరోపించారు.
పోలీసులు ఖాకీ చొక్కా పక్కన పెట్టి వైసీపీ చొక్కా వేసుకున్నారని బుద్దా వెంకన్న విమర్శించారు.రూ.కోట్ల ఆదాయం వదులుకొని పవన్ రాజకీయాల్లోకి వచ్చారని పేర్కొన్నారు.చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు నిజాయితీ పరులని ఆయన వ్యాఖ్యనించారు.
చంద్రబాబు, పవన్ లపై వైసీపీ నేతలు కావాలనే కుట్ర పూరితంగా బురద జల్లుతున్నారని మండిపడ్డారు.







