పూర్వం సమాజంలో అవివాహిత అమ్మాయిలతో, అబ్బాయిలు అసలు మాట్లాడే వారు కాదు.చూడడం కూడా అసాధ్యమే అన్నట్లుగా అప్పట్లో అమ్మాయిలు ఉండేవారు.
అలాగే పెళ్లి కూడా ఒకరినొకరు చూసుకోకుండా కేవలం తమ తల్లిదండ్రుల మాట మీదకే చేసుకునేవారు.కానీ ఇప్పటి సమాజంలో మాత్రం అలా లేదు.
మారుతున్న కాలంతో పాటు సమాజంలో కూడా చాలా మార్పులు వచ్చాయి.
ఇక కాలానుగుణంగానే ప్రేమించుకుని వివాహాలు ( Marriages ) చేసుకుంటున్నారు.
అయితే దీనికి కారణం కూడా జ్యోతిష్య ప్రభావమే అని అంటున్నారు జ్యోతిష్య నిపుణులు.కొన్ని రాశులకు చెందిన అమ్మాయిలు ఎక్కువగా ప్రేమ పెళ్లిళ్లు చేసుకుంటారని జ్యోతిష్య శాస్త్రంలో( Jyotishya Sastram ) ఉంది.
అయితే ఏ ఏ రాశులకు చెందిన అమ్మాయిలు ప్రేమ పెళ్లి( Love Marriage ) చేసుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం.
మేష రాశి:
మేష రాశి వారికి ఆలోచన శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది.అందుకే ఒక్కసారి ఎవరినైనా నమ్మితే జీవితాంతం వారిని మర్చిపోరు.దీంతో వారు ప్రేమ వివాహాన్ని ఎక్కువగా నమ్ముతారు.
ప్రేమ ప్రయాణంలోనూ కూడా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, చివరకు అందరినీ మెప్పించి, జీవితంలో విజయం సాధిస్తారు.అనుకున్నట్టుగానే ప్రేమ వివాహం చేసుకుంటారు.
మిధున రాశి:
మిధున రాశి వారిలో కూడా సేవా భావం ఎక్కువగా ఉంటుంది.అందుకే వారు ఉండే సమాజంలో వారికి మంచి పేరు ఉంటుంది.వారు అందరికీ ఉపయోగపడే పనులు చేస్తూ ఉంటారు.పూర్తి నిజాయితీగా వ్యవహరిస్తూ ఉంటారు.అందుకే వీరు ఎక్కువగా ప్రేమ వివాహం చేసుకునే అవకాశాలు ఉన్నాయి.అంతేకాకుండా వీరు చాలాసార్లు ఇబ్బందులు ఎదుర్కొంటారు.అయినప్పటికీ ఆ ఇబ్బందులను ఎదుర్కొని తమ లక్ష్యానికి చేరుకుంటారు.
వృషభ రాశి:
ఇక వృషభ రాశి అమ్మాయిలు కూడా చాలా మొండివారని చెప్పుకోవాలి.వీరు ఇతరులపై ఆధిపత్యం చేయించాలనుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు.ఇక వారిని జీవితంలో ఎప్పుడూ కూడా విడిచి పెట్టరు.అందుకే వీరు కచ్చితంగా తమకు నచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకుంటారు.అందుకే ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటున్న అబ్బాయిలు ఈ రాశికి చెందిన అమ్మాయిలను ప్రేమిస్తే ప్రేమ వివాహం చేసుకుంటారు.
DEVOTIONAL