దేశ వ్యాప్తంగా హిందూ ప్రజలు జరుపుకునే పండుగలలో దీపావళి ఒకటి. దీపావళి కార్తీక మాసం అమావాస్య రోజున ఎంతో వేడుకగా జరుపుకుంటారు.
ఇక ఈ పండగ రోజు లక్ష్మి పూజ అనంతరం ఇంటిని దీపాలతో ఎంతో అందంగా అలంకరిస్తారు.పూర్వకాలంలో దీపాలను వెలిగించడం కోసం పూర్తిగా మట్టి ప్రమిదలను తయారు చేసుకుని వాటిలో వత్తులు వేసి నువ్వుల నూనెతో దీపాలు వెలిగించే వారు.
ఇలా చేయడం వల్ల వాతావరణంలో ఉన్న క్రిమికీటకాలు నాశనం అవ్వడమే కాకుండా ఆ దీపపు కాంతి కంటికి ప్రశాంతతను కల్పిస్తుంది.అయితే నేడు మార్కెట్లోకి లభించే ఎన్నో రకాల దీపపు ప్రమిదలను ఉపయోగిస్తుంటారు.
అలాగే చాలామంది ప్రమిదలను కాకుండా కొవ్వొత్తులను వెలిగిస్తారు.దీపావళి పండుగ రోజు పొరపాటున కూడా ఎవరు కొవ్వొత్తులను వెలిగించకూడదని పండితులు చెబుతున్నారు.దీపం శుభాన్ని చూపిస్తే కొవ్వొత్తి శోకాన్ని ఇస్తుంది కనుక దీపావళి పండుగ రోజు పొరపాటున కూడా ఇంట్లో కొవ్వొత్తులను వెలిగించకూడదు.కేవలం మట్టి ప్రమిదల్లో వత్తులను వేసి నువ్వుల నూనెతో దీపారాధన చేసి దీపాలను వెలిగించడం ఎంతో శుభకరం.

అలాగే దీపారాధన చేసే సమయంలో దీపం జ్యోతి పరం బ్రహ్మ దీపం జ్యోతి మహేశ్వర! దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదేవి నమోస్తుతే!! అనే శ్లోకాన్ని చదువుతూ దీపం వెలిగించాలి.దీపాన్ని వెలిగించిన తరువాత దీపం ముందర ఎర్రని అక్షింతలు లేదా ఎర్రని పూలు వేయడం ఎంతో శుభసూచకం.దీపానికి అంత మహిమ ఉంది కనుక కేవలం దీపావళి రోజు మట్టి ప్రమిదలను మాత్రమే ఉపయోగించాలి.పొరపాటున కూడా కొవ్వొత్తులతో దీపాలు వెలిగించకూడదు.ఇలా చేయటం వల్ల కేవలం శోకం మాత్రమే మిగులుతుందని పండితులు తెలియజేస్తున్నారు.