ఆర్ఆర్ఆర్ గురించి ఎన్టీఆర్ అసంతృప్తితో ఉన్నాడా.. అందుకు కారణాలు ఇవేనా?

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన పాన్ ఇండియా సినిమా ఆర్ఆర్ఆర్.సినిమా తాజాగా విడుదల అయి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుని ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.

 Reasons Behind Ntr Dissatisfaction Over Rrr Movie , Ntr , Rrr , Tollywood , Dis-TeluguStop.com

ఇదిలా ఉంటే ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.అదేమిటంటే ఆర్ఆర్ఆర్ సంచలన విజయాన్ని అందుకున్నప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం కాస్త అసంతృప్తితో ఉన్నాడా? మరి జూనియర్ ఎన్టీఆర్ అసంతృప్తికి కారణాలు ఏమిటి? ప్రస్తుతం ఇలాంటి ప్రశ్నలపై సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి.

సినిమా విడుదలకు ముందు రోజు ప్రీమియర్ షోను చూసిన ఎన్టీఆర్, అనంతరం బయటకు వస్తూ అభిమానులను సంతోషంతో అభివాదం చేసిన సంగతి తెలిసిందే.కానీ ఆర్ఆర్ఆర్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయినప్పటికీ ఎన్టీఆర్ ముఖంలో మాత్రం కళ మిస్సయింది అంటున్నారు.అంతేకాకుండా సినిమా విడుదల తర్వాత సక్సెస్ మీట్ లో భాగంగా చిత్ర బృందం ఒక స్పెషల్ పార్టీ కోసం ప్లాన్ చేసుకున్నా కూడా అక్కడికి ఎన్టీఆర్ వెళ్ళలేదు అని తాజాగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.3 గంటలపాటు ఉన్న ఆర్ఆర్ఆర్ సినిమాలో అదనంగా ఉన్న మరొక 20 నిమిషాల ఫుటేజీ కత్తిరించబడింది.

Telugu Blockbuster, Cherry, Dis, Rajamouli, Ram Charan, Tollywood-Movie

ఇక అందులో ఎన్టీఆర్ కి సంబంధించిన ఎలివేషన్ అండ్ ఎమోషనల్ కంటెంట్ ఎక్కువగా ఉందని, వాటిని కట్ చేయడంతో ఎన్టీఆర్ అసంతృప్తికి లోనయ్యారు అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.కొందరు అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఎన్టీఆర్ ని రాజమౌళి, రామ్ చరణ్ కలిసి అన్యాయం చేశారు అని ఆరోపిస్తున్నారు.మరి ఈ విషయంపై చిత్ర బృందం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి.మరో వైపు రామ్ చరణ్ అభిమానులు మాత్రం చెర్రీ బర్త్ డే పార్టీలో మరింత ఉత్సాహంగా కనిపించారు.రామ్ చరణ్ ముఖంలో మాత్రం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సందర్భంగా సంతోషం అంతా ముఖంలో కొట్టొచ్చినట్లు కనబడుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube