క్రమం తప్పకుండా ఐ లైనర్స్ ఉపయోగిస్తున్నారా.. అయితే ఇది మీకోసమే..!

సాధారణంగా చెప్పాలంటే మహిళలకు( women ) అందంపై మక్కువ ఎక్కువ అని అందరికీ తెలుసు.అందరిలో వారు అందంగా కనిపించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.

 Are You Using Eye Liners Regularly But This Is For You , Health , Health Tips, E-TeluguStop.com

అందరిలో వారే అందంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు.బ్యూటీ పార్లర్ లలో వేలకు వేలు ఖర్చు చేస్తూ ఉంటారు.

మహిళల అందంలో కళ్ల అందానికి కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది.ఆ కళ్లను మరింత అందంగా మార్చేందుకు కళ్లకు కాటుక ఐ లైనర్లను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు.

అయితే ఇలా ఐలైనర్లు కళ్లకు ఉపయోగించడం వల్ల అనేక సమస్యలు వస్తాయన్న విషయం చాలామందికి తెలియదు.

Telugu Eyeliners, Cotton, Eye Problems, Tips-Telugu Health

ఐలైనర్లు వల్ల కళ్లకు సమస్యలు( Eye problems ) వస్తాయని నిపుణులు చెబుతున్నారు.చాలామందికి ఐలైనర్లు ఎలా ఉపయోగించాలో కూడా తెలియదు.అలాగే ఎలా రిమూవ్ చేయాలో కూడా తెలియదు.

ఇష్టానుసారంగా వాడుతూ ఉంటారు.దీంతో కళ్లకు మసక బారినట్లు ఉండడం, కళ్ల కింద మండడం కళ్లలో మంట వంటి ప్రమాదాలు వస్తాయి.

మరి ఎలాంటి ఐ లైనర్స్ వాడాలి ఎలా వాడితే సురక్షితము ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Eyeliners, Cotton, Eye Problems, Tips-Telugu Health

ముఖ్యంగా చెప్పాలంటే ఐలైనర్స్(Eyeliners ) ఎలా శుభ్రం చేయాలో చాలామందికి తెలియక ఎన్నో రకాల తిప్పలు పడుతూ ఉంటారు.కొందరు కాటన్ దుస్తుల తో తీస్తారు.మరికొందరు నూనె రాసి సబ్బుతో కడుగుతూ ఉంటారు.

అయినా వాడటమే కాదు దాన్ని ఎలా రిమూవ్ చేయాలో కూడా నిపుణుల నుంచి తెలుసుకోవడం మంచిది.లేకుంటే కళ్లు పోయే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.

ఇంకా చెప్పాలంటే వాటర్ లైన్ ప్రాంతంలో అప్లై చేయడం వల్ల అక్కడ ఉండే గ్రంధులు సరిగ్గా నూనెలను ఉత్పత్తి చేయలేవు.అవి సరిగ్గా పని చేయని కారణంగా కళ్లకు సంబంధించి అనేక సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

కాబట్టి వీలైనంతవరకు లిక్విడ్ ఐ లైనర్లను వాడడమే మంచిది.అలాగే నిద్రపోయేటప్పుడు ఐ లైనర్లను తొలగించి కళ్లను శుభ్రంగా కడుక్కుని నిద్రపోవాలి.

లేదంటే కళ్ల పై చెడు ప్రభావం పడే అవకాశం ఎక్కువగా ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube