తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జూలై20, శనివారం2024

ఈ రోజు పంచాంగం ( Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 5.52

 Telugu Daily Astrology Prediction Telegu Rasi Phalalu July 20 Saturday 2024, Ju-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం.6.54

రాహుకాలం: ఉ.9.00 ల10.30

అమృత ఘడియలు: ఉ.11 ల11.45

దుర్ముహూర్తం: ఉ.6.30 ల7.36

మేషం:

Telugu Saturday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology, J

ఈరోజు విద్యార్ధులు పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు.బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు.నూతన వాహనయోగం ఉన్నది.

బంధు మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు.స్థిరాస్తి వివాదాల పరిష్కారదిశగా సాగుతాయి.వ్యాపారమున కీలక నిర్ణయాలు తీసుకుని లాభాలు ఆర్జిస్తారు.

వృషభం:

Telugu Saturday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology, J

ఈరోజు ఇంటా బయట అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి ఉండదు.కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది.చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి.

వృధా ఖర్చులు పెరుగుతాయి పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు.ఆరోగ్య విషయాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి.వృత్తి, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

మిథునం:

Telugu Saturday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology, J

ఈరోజు సన్నిహితులతో మాటపట్టింపులుంటాయి.అవసరానికి ధన సహాయం అందుతుంది.ముఖ్యమైన పనులు మధ్యలో నిలిచిపోతాయి.

వృత్తి వ్యాపారాలలో శ్రమ పెరుగుతుంది.ఆరోగ్య సమస్యలు వలన చికాకులు పెరుగుతాయి.

వ్యాపారాలు నిదానంగా సాగుతాయి.ఉద్యోగమున తొందరపాటు నిర్ణయాలు చెయ్యడం మంచిది కాదు.

కర్కాటకం:

Telugu Saturday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology, J

ఈరోజు చేపట్టిన పనులలో యత్నకార్యసిద్ధి కలుగుతుంది.ప్రముఖులతో పరిచయాలు లాభసాటిగా సాగుతాయి.చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది.నూతన ధన వస్తులాభాలు పొందుతారు.నూతన వాహనం కొనుగోలు చేస్తారు.వ్యాపార, ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.

సింహం:

Telugu Saturday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology, J

ఈరోజు నూతన వ్యాపార ప్రారంభానికి పెట్టుబడులు లభిస్తాయి.వృత్తి ఉద్యోగాలలో అధికారుల అండదండలతో సమస్యలు పరిష్కరించుకుంటారు.గృహమునకు బంధు మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది.సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.

కన్య:

Telugu Saturday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology, J

ఈరోజు ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు.ఆర్ధిక వృద్ధి కలుగుతుంది.

సమాజంలో పరిచయాలు పెరుగుతాయి.కుటుంబ విషయమై ముఖ్య నిర్ణయాలు అమలుపరుస్తారు.వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికర వాతావరణం ఉంటుంది.

తుల:

Telugu Saturday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology, J

ఈరోజు రుణదాతల నుండి ఋణ ఒత్తిడి పెరుగుతుంది.వృత్తి వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.చేపట్టిన పనులు వాయిదా పడతాయి.

ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి.ఉద్యోగులకు అధికారులతో నూతన సమస్యలు కలుగుతాయి.ఆర్థికంగా నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.

వృశ్చికం:

Telugu Saturday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology, J

ఈరోజు ఉద్యోగమున మీ పని తీరుకు గుర్తింపు పొందుతారు.చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది.వ్యాపారాలు అనుకున్న విధంగా రాణిస్తాయి.

చిన్ననాటి మిత్రులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు.ఆదాయం పెరుగుతుంది.వ్యాపారాలు నూతనోత్సాహంతో లాభాలు అందుకుంటారు.

ధనుస్సు:

Telugu Saturday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology, J

ఈరోజు ఆర్థిక పురోగతి సాధిస్తారు.నూతన వస్తు, వస్త్రలాభాలు పొందుతారు.చిన్ననాటి స్నేహితులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి.వ్యాపారాలు సజావుగా సాగుతాయి.ఉద్యోగమున జీత భత్యాల విషయంలో అనుకూలత పెరుగుతుంది.

మకరం:

Telugu Saturday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology, J

ఈరోజు వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది.ఇంటా బయట ఒత్తిడి వలన మానసిక సమస్యలు కలుగుతాయి.ముఖ్యమైన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి.

దూరప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి.

కుంభం:

Telugu Saturday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology, J

ఈరోజు ఇంటా బయట ఆదరణ పెరుగుతుంది.బంధు మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.సమాజంలో పెద్దల ఆదరణ పెరుగుతుంది.

నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు అందుకుంటారు.నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి.వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.

మీనం

:

Telugu Saturday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology, J

ఈరోజు ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు.ఉదర సంభందిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.వ్యాపారాలు నత్తనడకగా సాగుతాయి.

కుటుంబ సభ్యులతో వివాదాలుంటాయి.ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

ఉద్యోగులు అదనపు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.ఆర్ధిక సమస్యలు బాధిస్తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube