ప్రోటీన్‌లు బాగా దొరికే ఆహారం కావాలా?

శరీరానికి అవసరమైన తొమ్మిది అమినో ఆసిడ్స్ ప్రోటీన్‌లలో దొరుకుతుందనే విషయం మనందరికి తెలిసిందే.గుండెతో పాటు శరీరం ఆరోగ్యంగా,బలంగా ఉండాలంటే ప్రోటీన్‌ల అవసరం చాలా ఉంది.

 Foods With Rich Protien Content-TeluguStop.com

కష్టమైన పనులు చేసేవారికి, క్రీడల్లో పాల్గొనేవారికి ప్రోటీన్‌లు ఉండే ఆహారం తినడం అత్యవసరం.మరి ప్రోటీన్‌లు అధికంగా లభించే ఆహారాలు ఏమిటో తెలుసుకుందామా?

* ప్రోటీన్‌లు బాగా లభించే ఆహారం చికెన్.ఇందులో చాలా క్వాలిటి ప్రోటీన్‌లు దొరుకుతాయి.ప్రతి 100 గ్రాముల చికెన్ లో 30గ్రాముల ప్రోటీన్ ఉంటుంది.అంటే మనకు రోజూ కావాల్సిన ప్రొటీన్‌లలో 70% శాతం ఇక్కడే దొరుకుతుందన్న మాట.ఇంతకుముందు చెప్పినట్టు శరీరానికి 9 రకాల అమినో ఆసిడ్స్ అవసరం.ఇవన్ని చికెన్ లో లభిస్తాయి.

* నట్స్ లో కూడా ప్రోటీన్‌లు బాగా దొరుకుతాయి.

ఇందులో ప్రోటీన్‌లు మాత్రమే కాదు, విటమిన్ ఈ, యాంటిఆక్సిడెంట్స్, సాచురేటెడ్ ఫ్యాట్స్ కూడా లభిస్తాయి.

* గుడ్డులో కూడా ప్రోటీన్‌లు మంచి మోతాదులో దొరుకుతాయి.సగటున ఒక్క గుడ్డులో 6.5 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది.

* బీన్స్, సోయాబీన్స్ లో కూడా ప్రోటీన్ ఉంటుంది.

* చేపలు కూడా ప్రోటీన్‌లు అందిస్తాయి.

దాంతోపాటు శరీరానికి అవసరమైన ఒమేగా -3 ఫాట్టి ఆసిడ్స్, విటమిన్ బి 12 అదనంగా లభిస్తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube