సాధారణంగా అందరి చర్మ తత్వాలు ఒకేలా ఉండవు.కొందరివి ఆయిలీగా ఉంటే.
మరికొందరివి డ్రై గా ఉంటాయి.అయితే ఆయిల్ స్కిన్ వారికే సమస్యలన్నీ అని భావిస్తుంటారు.
కానీ డ్రై స్కిన్( Dry Skin ) వారు కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తుంటారు.మీరు కూడా డ్రై స్కిన్ తో బాధపడుతున్నారా.? ఎంత ఖరీదైన మాయిశ్చరైజర్ వాడిన సరే చర్మం మళ్లీ మళ్లీ డ్రై గానే మారుతుందా.? వర్రీ వద్దు ఇప్పుడు చెప్పబోయే సింపుల్ రెమెడీని కనుక పాటిస్తే డ్రై స్కిన్ అన్న మాట అనరు.

ఈ రెమెడీతో మీ ముఖ చర్మం స్మూత్ అండ్ షైనీ( Smooth and Shiny Skin ) గా మెరిసిపోవడం ఖాయం.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.ముందుగా ఒక కాటన్ వస్త్రాన్ని తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు పెరుగు వేసి వాటర్ ను తొలగించాలి.ఇప్పుడు బౌల్ తీసుకుని అందులో నీరు తొలగించిన పెరుగును వేసుకోవాలి.
అలాగే వన్ టేబుల్ స్పూన్ గ్లిజరిన్, వన్ టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్( Milk Powder ) వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
తద్వారా ఓ మంచి మసాజ్ క్రీమ్ సిద్ధమవుతుంది.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి, కావాలి అనుకుంటే మెడకు అప్లై చేసుకొని కనీసం పది నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.ఆపై చర్మాన్ని ఇరవై నిమిషాల పాటు ఆరబెట్టుకుని.
అప్పుడు గోరు వెచ్చని నీటితో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.నైట్ నిద్రించే ముందు ఈ రెమెడీని పాటిస్తే చాలా బెటర్.

ఈ న్యాచురల్ హోమ్ రెమెడీ( Home Remedies ) మీ డ్రై స్కిన్ ను రిపేర్ చేయడానికి చాలా గ్రేట్ గా సహాయపడుతుంది.ఈ రెమెడీని రెగ్యులర్గా పాటిస్తే డ్రై స్కిన్ అన్నమాట అనరు.మీ ముఖ చర్మం స్మూత్ గా సాఫ్ట్ గా షైనీ గా మెరుస్తుంది.ఈ హోమ్ రెమెడీ మీ చర్మంపై తేమను పెంచుతుంది.దాంతో మీ చర్మం తరచూ డ్రై అవ్వకుండా ఉంటుంది.అంతేకాదు మీ రెమెడీని పాటించడం వల్ల ముడతలు త్వరగా రాకుండా ఉంటాయి.
చర్మం యవ్వనంగా మెరుస్తుంది.స్కిన్ టోన్ సైతం పెరుగుతుంది.