జనసేన అధినేత పవన్ కల్యాణ్ దత్తపుత్రుడనే పేరుకు ఫిక్స్ అయిపోయారని తెలుస్తోంది.జగన్ పెట్టిన పేరును నిలుపే విధంగా కొన్ని సంఘటనలు చోటు చేసుకోవడం గమనార్హం అని చెప్పుకోవచ్చు.
ఏపీలో జగన్ పాలనపై విమర్శలు గుప్పిస్తూ అధికారాన్ని తాము పొందేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ లు శత విధాల ప్రయత్నిస్తున్నాయి.టీడీపీ అధినేత చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ అంటూ ఏపీలో నాయకులు చెబుతున్న వ్యాఖ్యలకు మరింత బలాన్ని చేకూర్చుతూ వెలువడిన కొన్ని కథనాలు చర్చనీయాంశంగా మారింది.
వైసీపీ ప్రభుత్వాన్ని అధికారంలో నుంచి దింపివేయాలనే ఆలోచనతో ప్రతిపక్ష నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తుండగా.కొన్ని పత్రికలు వారికి సపోర్ట్ చేస్తూ జగన్ ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నాయి.
వీటన్నింటిని చూస్తుంటే చంద్రబాబుకు పవన్ కల్యాణ్ దత్తపుత్రుడన్న మాటలు నిజమేనని, జనసేనాని ఎవరి ఎజెండా కోసం తన జెండాను దింపేశారో ప్రజలకు చాలా ఈజీగానే అర్ధం అవుతుంది.
ఏపీలో గతంలో జరిగిన ఎన్నికల్లో కేవలం రెండు చోట్ల బరిలోకి దిగి ఓటమి పాలైన పవన్ ను ఆకాశానికి ఎత్తుతూ కొన్ని కథనాలు ప్రచురితం అయ్యాయి.
ఇందుకు ఏకైక కారణం దత్తపుత్రుడు మీద పొంగుతున్న ప్రేమనే కారణమా.? అనే ప్రశ్న ప్రతి ఒక్కరి మదిలో తలెత్తుతోంది.అయితే టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తనను హత్య చేయడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారంటూ ఇదే ప్యాకేజ్ స్టార్ అప్పటిలో ఆరోపించారు.తాజాగా ఇప్పుడు జగన్ ప్రభుత్వంపై కూడా అవే ఆరోపణలు చేస్తున్నారు పవన్ కల్యాణ్.
తనను హత్య చేసేందుకు సుఫారీ గ్యాంగ్ లు దిగాయంటూ, తనకు ప్రాణహాని ఉందంటూ ఆరోపించారు.ఈ క్రమంలో పవన్ చేసిన ఆరోపణలపై ఆధారాలు చూపించాలని, లేని పక్షంలో పవన్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కొందరు కోరుతున్నారని తెలుస్తోంది.
ఒకప్పుడు చంద్రబాబు తనను చంపాలని చూస్తున్నారన్న పవన్ ఇప్పుడు అదే చంద్రబాబు ఇంటికి వెళ్లి డబ్బులు ప్యాకేజీ మాట్లాడుకున్నారనే వార్తలు జోరుగా సాగుతున్నాయి.ఇక మిగిలింది జనసేనాని డైలాగులు.
రాష్ట్రంలో ఇటీవల నిర్వహిస్తున్న వారాహి విజయ యాత్రలో భాగంగా జగన్ ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ ఇష్టం వచ్చిన విధంగా ఆరోపణలు చేస్తున్నారు.అయితే ఈ మాటలు కూడా చంద్రబాబు ఇంటి నుంచే వస్తున్నాయని, ఆయన డైరెక్షన్ లోనే పవన్ నడుస్తున్నారని తెలుస్తోంది.
తాను ఎమ్మెల్యే కావాలని మొదటి రోజు చెప్పిన స్క్రిప్ట్ దగ్గర నుంచి గెలిపిస్తే సీఎం అవుతానంటూ చెప్పిన డైలాగ్ వరకు టీడీపీనే చెప్పించిందని పలువురు ఆరోపిస్తున్నారు.
పవన్ చేసిన వ్యాఖ్యల్లో ఏ మాత్రం నిజం ఉన్నా ఆయన ఒంటరిగా 175 నియోజకవర్గాల్లో పోటీ చేయొచ్చు కదా.మరి అలా ఎందుకు చేయడం లేదు.రాష్ట్రం మొత్తం మీద టీడీపీ చెప్పినట్లు సెలక్టివ్ గా పోటీ చేయడం ఎందుకు.? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.కనీసం తను పోటీ చేసిన స్థానంలో కూడా గెలవలేని వాడు వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఎన్ని ఓట్లు తగ్గుతాయో తన చిలుకతోనే, ఎలుకతోనే జ్యోతిష్యం చెప్పడం హాస్యాస్పదంగా ఉంది.
జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలోనే ఏపీ అభివృద్ధి పథంలో దూసుకు వెళ్తుంది.జగన్ తరహాలో ప్రజలకు సంక్షేమ పథకాలు చేరువ చేసిన ఘనత గత చరిత్రలో ఎప్పుడూ లేదు.
ఇవన్నీ అర్థం కాబట్టే ఇసుక, మద్యం అంటూ కొత్త సాకులు వెతుక్కుంటూ విమర్శలు చేస్తున్నారు విపక్ష నేతలు.
బాబు ఫిలాసిఫీయే పవన్ ఖులాసఫీయా.?.కాబట్టి వారికి ఏం కావాలంటే అదే చెబుతున్నాడా.? ఇక మార్గదర్శిపై రాష్ట్ర ప్రభుత్వ చర్యల్ని ఏ న్యాయస్థానం అడ్డుకోదు.ఎందుకంటే.
తప్పు జరిగింది కాబట్టి.మార్గదర్శిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయాల్సిన అవసరం జగన్ కు లేదు.
నిజానికి, చంద్రబాబు హయాంలో చార్మినార్ బ్యాంక్, కృషి బ్యాంక్ తరహాలోనే 2014-19 మధ్య అగ్రిగోల్డ్ ఎత్తివేత జరిగింది.అయినా, అగ్రిగోల్డ్ ఇన్వెస్టర్ల ప్రయోజనాల దృష్ట్యా జగన్ ప్రభుత్వమే వారికి ప్రతి రూపాయి చెల్లించింది.
అటువంటి పరిస్థితి మళ్లీ మార్గదర్శిలో పునరావృతం కాకుండా అడ్డుకోవటానికి ప్రభుత్వం కృషి చేస్తుంటే సమర్థించాల్సింది పోయి.విమర్శలు చేస్తున్న పవన్ కల్యాణ్ విలువల వ్యవస్థే డే వన్ నుంచి ప్రశ్నార్థకంగా మారింది.
అయితే అన్ని పార్టీలు ఏకం అవ్వాలని, కులాల పరంగా విడిపోవద్దని పవన్ కల్యాణ్ అన్నట్టుగా కొన్ని కథనాలు వచ్చాయి.జగన్ పాలన బాగోలేదనుకుంటే.
అసలు కూటములతో పనేంటి.? నిజంగా వ్యతిరేక ఓటు ఉంటే.వీరంతా విడిగా పోటీ చేయటంలో ఎందుకు వెనకాడుతున్నట్లు.మంచి చేసిన చరిత్ర లేదు కాబట్టే.పొత్తుల కోసం ఆరాటపడుతున్నారు.పొత్తులు పెట్టుకోవటానికి ఒక సైద్ధాంత బలం లేదు కాబట్టే.
వ్యతిరేక ఓటు చీలనివ్వకూడదు అంటూ ఒక డైలాగ్ అందుకున్నారు.వైసీపీ చెబుతున్నట్లు దోచుకుందాం.
పంచుకుందాం.తినుకుందాం అన్న నినాదాల కలయికగానే మూడు, నాలుగు పార్టీలు కలసి రావాలని పవన్ కల్యాణ్ కోరుకుంటున్నాడని తెలుస్తోంది.
అసలు పార్టీ పెట్టి పదేళ్లు గడుస్తున్న రాష్ట్రంలో ఏ ఒక్కరోజు కుటుంబంతో లేని వ్యక్తికి.రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజా సమస్యలు ముఖ్యం అంటూ చెప్పడం హాస్యాస్పదంగా అనిపించడం లేదా,.? ఇటువంటి మాటలను ఎవరైనా నమ్మితే.ఇంతకన్నా అమాయకత్వం ఉంటుందా? అన్నది ప్రస్తుతం ఏపీ ప్రజల మనసులో మెదులుతున్న ప్రశ్న.







