సినిమా అంటేనే బయట జనాలు సాధించలేనిది సినిమాల్లో హీరో సాధించి చూపించడం.ఎందుకంటే ప్రేక్షకుడు సినిమా చూసేటప్పుడు తనని హీరోగా ఊహించుకుంటాడు,తను చేయలేని పని హీరో చేస్తున్నప్పుడు విజిల్స్ వేస్తూ క్లాప్స్ కొడుతూ ఉంటాడు అలాంటప్పుడు మనం స్క్రీన్ పైన హీరోని ఎలివేట్ చేస్తూ సినిమాలు చేయాలి తప్ప హీరోని చేతగానివాడుగా ఏమీ చేయలేని వాడిగా చూపించకూడదు.
హీరో నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఆయన కెరీర్ లో ఎన్నో సినిమాలు హిట్స్, బ్లాక్ బస్టర్, సిల్వర్ జూబ్లీ ఆడిన సినిమాలు కూడా ఉన్నాయి.
అలాంటి నాగార్జున ఒక సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు సినిమాకు సంబంధించిన సీన్ లో అది ఎందుకు జరుగుతుంది అని ఎందుకు ఇలా చేయాలి అని ఇలాంటి కొన్ని ప్రశ్నలు డైరెక్టర్ని అడిగి విసిగించడంతో విసిగిపోయిన ఆ దర్శకుడు అటు నాగార్జునకు సమాధానం చెప్పాలా, లేదా ఇటు సినిమా చేయాలో ఏమీ అర్థం కాక డైరెక్టర్ తల పట్టుకునేవారట.
ఇక చేసేదేం లేక నాగార్జునతో ఇలా చెప్పేశారట నువ్వు రోజు షూటింగ్ కి వచ్చేటప్పుడు నీ బుర్ర ని ఇంటి దగ్గర పెట్టేసి ఒక మనిషివి మాత్రమే షూటింగ్ రా అప్పుడైతే ఏ గొడవా ఉండదు అని చెప్పాడంట.కమర్షియల్ సినిమాల్లో లాజిక్ లతో పెద్దగా పని లేదని మాస్ మసాలా సినిమాల్లో హీరో ఒకరిని కొడితే కింద పడి పోయే సీన్స్ చాలా ఉండాలి లేకపోతే సినిమాలు ఆడవు.
అలాగే సినిమాల్లో హీరో ఫ్యాన్స్ తప్పకుండా ఇలాంటి ఫైట్స్ గాని, ఎలివేషన్ సీన్స్ గాని ఎక్కువగా కోరుకుంటారు కాబట్టి దర్శకులు కూడా దానికి అనుకూలంగానే ఫైట్స్ గాని , సాంగ్స్ గాని, సెంటిమెంట్ సీన్స్ గాని తీస్తారు.
ప్రస్తుతం ఉన్న దర్శకులు బోయపాటి శ్రీను గారు తీసే ప్రతి సినిమా ఇలాంటి కోవకె చెందుతుంది.ఫస్ట్ సినిమా భద్ర నుంచి నిన్నటి వినయ విధేయ రామ దాకా అన్ని సినిమాల్లో ఫైట్స్ ఉంటాయి కొన్ని సినిమాలలో లాజిక్ లేకుండా మ్యాజిక్ చేయగల సత్తా ఉన్న దర్శకులు బోయపాటి శ్రీను.గారు అయితే వాటిలో కొన్ని సినిమాలు ఫ్లాప్ గా కూడా నిలిచాయి.
మరి జనాలు పట్టించుకోవట్లేదు కదా అని తల నరికితే గాల్లో గద్దలు ఎత్తు కెళ్ళడం,ట్రైన్ మీద పరిగెత్తడం ఇలాంటి సీన్స్ తో జనాలు తలకాయ పట్టుకున్నారు.ఇలాంటి ఫార్ములా సక్సెస్ అవుతుంది కానీ అది ఇప్పటి కంటే ఒక పది సంవత్సరాల కిందట ఎక్కువగా సక్సెస్ అయిన ఫార్ములా అయితే ఇప్పుడు జనాలు పర భాష సినిమాలు కూడా ఎక్కువగా చూస్తున్నారు కాబట్టి తమిళం మలయాళంలో వాళ్ళు రియాలిటీకి దగ్గరగా ఉన్న సినిమాలు తీస్తూ ఉంటారు కాబట్టి మన సినిమాలు అలా ఉండటం లేదు ఏంటి అనే చిన్న ఆలోచనలో జనాలు ఉన్నట్టు అర్థం చేసుకోవచ్చు.
అందుకే మాస్ సినిమా కి దూరంగా ఉండి రియాలిటీకి దగ్గరగా ఉన్న కేరాఫ్ కంచరపాలెం, అర్జున్ రెడ్డి తో పాటు నాని ప్రొడ్యూస్ చేసిన ఆ లాంటి సినిమాలు హిట్ అయ్యాయి అని చెప్పొచ్చు.
ప్రేక్షకుడి ఆలోచనా ధోరణి ఎప్పుడూ ఒకేలా ఉంటుందని మనం అనుకోవడం తప్పు అవుతుంది ఒకప్పుడు మాస్ మసాలా సినిమాల్ని సక్సెస్ చేసిన జనాలే ఈరోజు కంటెంట్ ఉన్న సినిమాలని మాత్రమే ఆదరిస్తున్నారు.ఒకప్పుడు విశ్వనాధ్ గారు తీసిన శంకరాభరణం, సాగర సంగమం, స్వయంకృషి లాంటి సినిమాలు బాగా ఆదరణ పొందాయి.కంటెంట్ ఉన్న సినిమాలు అప్పుడు కూడా వచ్చాయి అవి క్లాసికల్ గా మిగిలిపోయాయి కానీ మాస్ మసాలా సినిమాకు వచ్చిన క్రేజ్ గాని, డబ్బులు గానీ కంటెంట్ ఉన్న ఆర్ట్ సినిమాలకి రాలేదనే చెప్పాలి.
కానీ జనాల అభిరుచి ఈ మధ్యకాలంలో బాగా మారిపోయింది అందుకే హీరోలు కూడా జనాలకి నచ్చిన సినిమాలు చేయడానికి ముందుకు వస్తున్నారు.ఆ విధంగానే తమిళంలో ధనుష్ హీరోగా చేసిన అసురన్ మూవీలో ధనుష్ వయస్సు 60 సంవత్సరాలు ఒక 30 సంవత్సరాల హీరో 60 సంవత్సరాల మనిషిగా యాక్టింగ్ చేయడం అనేది చాలా గొప్ప విషయం.
ఆ పాత్రలో యాక్టింగ్ చేయడమే కాదు 60 సంవత్సరాల వయసు ఉన్న మనిషిగా జీవించిచేశాడనే చెప్పాలి.అక్కడ మంచి విజయం సాధించిన ఆ సినిమాని తెలుగులో వెంకటేష్ హీరోగా చేస్తున్నాడు.
ఇప్పుడిప్పుడే తెలుగులో మాస్ మసాలా సినిమాని పక్కన పెట్టి కంటెంట్ ఉన్న సినిమాలనీ ఆర్ట్ సినిమాలని హీరోలు చేస్తున్నారు.జనాలు కూడా వాటిని బాగా ఆదరిస్తున్నారు.