తెలుగుతెరపై అభిమానుల్ని మాయ చేసే యాక్టింగ్ తో మంత్రముగ్ధుల్ని చేసిన నటుడు ఎవరు అంటే ఇప్పటికీ అందరూ చెప్పే ఒకే ఒక్క పేరు నందమూరి తారక రామారావు.ఆయన చేయని క్యారెక్టర్ లేదు, ఆయన వేయని వేషం లేదు, ఆయన స్థాయి లేదు,ఆయన అనుభవించిన విలాసం లేదు.
నందమూరి తారక రామారావు గారు సినిమాల్లో మంచి స్టార్ హీరోగా కొన్ని సంవత్సరాల పాటు గుర్తింపు పొందిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చి తెలుగు దేశం అనే పార్టీని స్థాపించారు ఆ పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చి CM అయిన ఏకైక వ్యక్తి కూడా రామారావు గారె.పేదలకి రెండు రూపాయలకు కిలో బియ్యం ఇచ్చిన వ్యక్తి అలాగే తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని నిలిపిన ఏకైక వ్యక్తి తెలుగువాడు అంటే ఎవరికీ తక్కువ కాదు అని కాలర్ ఎగరేసుకునేల చేసిన గొప్ప మనిషి నందమూరి తారక రామారావు గారు ఆయన వారసుడిగా హరికృష్ణ ఎంట్రీ ఇచ్చినప్పటికీ సినిమాల్లో పెద్దగా రాణించలేకపోయాడు.
ఇంకో కొడుకు అయినా బాలకృష్ణ మాత్రం రామారావు గారి వారసుడిగా ఇండస్ట్రీకి వచ్చి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
యువరత్న నందమూరి బాలకృష్ణ ఇండస్ట్రీలో 4 దశాబ్దాల పాటు టాప్ హీరో గా కొనసాగుతున్నాడు.
బాలకృష్ణకి 1982లో వసుంధరాదేవితో పెళ్లయింది.వసుంధర దేవి ఎవరు అంటే శ్రీ రామదాసు మోటార్ ట్రాన్స్ పోర్ట్ అధినేత అయిన దేవరపల్లి సూర్యరావు గారి అమ్మాయి.
స్వతహాగా వందల కోట్ల ఆస్తికి వారసురాలు ఆవిడ.వసుంధర గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత బాలకృష్ణ గారిని పెళ్లి చేసుకున్నారు.
అయితే ఒక సరదా సంఘటన ఏం జరిగిందంటే కాకినాడలో బాలకృష్ణ నటించిన రామ్ రహీం సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు షూటింగ్ లో భాగంగా బాలకృష్ణ రిక్షా తొక్కే ఒక సీన్ తీస్తున్నప్పుడు వసుంధర వాళ్ళ అమ్మ బాలకృష్ణ ను చూసి అది షూటింగ్ అని తెలియక ఆశ్చర్యపోయి ఎన్టీఆర్ గారి కొడుకైన బాలకృష్ణ ఇలా రిక్షా తొక్కుతున్నారు ఏంటి అని చాలా బాధపడింది అంట ఆ విషయం బాలకృష్ణకి వసుంధర తో పెళ్లి జరిగిన తర్వాత వసుంధర వాళ్ళ అమ్మ బాలకృష్ణ తో చెప్పిందట.అయితే బాలకృష్ణ సినిమాల్లో బిజీగా ఉంటారుఫ్యామిలీకి సంబంధించిన విషయాలను కొంచెం తక్కువ పట్టించుకుంటారు అని ఎప్పుడు సినిమాలోని బిజీగా ఉంటూ ఎప్పుడు ఏం సినిమా చేయాలి తన ఫ్యాన్స్ కి ఏ సినిమా కావాలి వాళ్లు తమ నుంచి ఏ సినిమాను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇలాంటి ఆలోచనతోనే ఉంటారంట అయితే ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు మొత్తం వసుంధర గారు చూసుకుంటారు.
దాంతో బాలకృష్ణనీ అర్థం చేసుకునే భార్య దొరికిందని చాలా సార్లు బాలకృష్ణ చాలా మందితో చెప్పాడంట.వీళ్ళకి బ్రాహ్మణి, తేజస్వి, మోక్షజ్ఞ అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు బ్రాహ్మణినీ నారా చంద్రబాబు నాయుడు గారి కొడుకు అయిన లోకేష్ కి ఇచ్చి పెళ్లి చేశారు.
అలాగే తేజస్వి నీ కూడా వైజాగ్ గీతం సంస్థలకు చెందిన శ్రీ భరత్ కి ఇచ్చి పెళ్లి చేశారు.కొడుకు మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు.
ఇప్పటికే మోక్షజ్ఞని హీరోగా పెట్టి సినిమా చేయడానికి మాస్ సినిమాల దర్శకుడు అయిన బోయపాటి శ్రీను అప్పట్లో కథ కూడా చెప్పాడని వార్తలు వచ్చాయి మోక్షజ్ఞ మొదటి సినిమా తీసే అవకాశం బాలకృష్ణ కి సింహం లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన బోయపాటి కి ఇస్తాడో లేదా ఇంకా ఎవరైనా బయట దర్శకుడితో చేపిస్తాడో చూడాలి.ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు దీని తర్వాత రీసెంట్ గా రవితేజతో క్రాక్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడని దానిని మైత్రి మూవీస్ వారు నిర్మించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి ఈ సినిమా తర్వాత అప్పట్లో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో పైసా వసూల్ సినిమా తీస్తున్నప్పుడు బాలకృష్ణ పూరికి ఇంకో సినిమా చేద్దాం అని మాటిచ్చాడంట దీని తర్వాత పూరి జగన్నాథ్ సినిమానే ఉంటుందని బాలకృష్ణ అభిమానులు అంటున్నారు.అయితే ఇది ఇలా ఉంటే ఇప్పటికీ బాలకృష్ణ సినిమాకు సంబంధించిన రెమ్యునరేషన్ విషయంలో స్వతహాగా నిర్ణయం తీసుకోలేక వసుంధరనే రెమ్యునరేషన్ వివరాలు మొత్తం చూసుకుంటుందని టాక్.