మహేష్ జక్కన్న కాంబో మూవీపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొనగా ఈ సినిమా బడ్జెట్ ఏకంగా 1000 కోట్ల రూపాయలు అనే సంగతి తెలిసిందే.పృథ్వీరాజ్ సుకుమారన్( Prithviraj Sukumaran ) ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఒక ఇంటర్వ్యూలో పృథ్వీరాజ్ సుకుమారన్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.
పృథ్వీరాజ్ సుకుమారన్ మీడియాతో మాట్లాడుతూ నాకంటే మీకే చాలా విషయాలు తెలిశాయని పృథ్వీరాజ్ పేర్కొన్నారు.
ఇంకా ఏదీ క్లారిటీ లేదని ఆయన తెలిపారు.ఇందుకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయని అవి ఫైనల్ అయ్యాక దీని గురించి మాట్లాడుకుందామని పృథ్వీరాజ్ వెల్లడించారు.సలార్2 సినిమా( Salaar 2 ) గురించి కూడా పృథ్వీరాజ్ సుకుమారన్ రియాక్ట్ అవ్వడం గమనార్హం.
సలార్2 సినిమాను తప్పకుండా చేస్తామని పృథ్వీరాజ్ సుకుమారన్ పేర్కొన్నారు.ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ విడుదలైన తర్వాత సలార్2 షూట్ మొదలవుతుందని పృథ్వీరాజ్ సుకుమారన్ వెల్లడించడం గమనార్హం.సలార్ సినిమా వల్ల ప్రభాస్( Prabhas ) నుంచి తాను ఎన్నో విషయాలను నేర్చుకున్నానని పృథ్వీరాజ్ సుకుమారన్ పేర్కొన్నారు.
ప్రభాస్ కు ఉన్న స్టార్ డమ్ ఆయనకు తెలియదని పృథ్వీరాజ్ వెల్లడించారు.
నాకు తెలిసినంత వరకు ఆయన సోషల్ మీడియా కూడా ఉపయోగించరని పృథ్వీరాజ్ పేర్కొన్నారు.ప్రభాస్ ప్రైవేట్ పర్సన్ అని అత్యంత సన్నిహితులతోనే అన్ని విషయాలు పంచుకుంటానని పృథ్వీరాజ్ పేర్కొన్నారు.మహేష్( Mahesh Babu ) రాజమౌళి( Rajamouli ) కాంబో మూవీ ఓపెనింగ్ ఫోటోలు ప్రముఖ ఓటీటీలో రిలీజ్ కానున్నాయని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.
మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ పారితోషికం ఒకింత భారీ స్థాయిలో ఉందనే సంగతి తెలిసిందే.పృథ్వీరాజ్ కొత్త ప్రాజెక్ట్స్ కు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది.