Halam : బాపు మెచ్చిన ఈ ఐటెం భామ హలం గురించి మీకు తెలుసా ?

హలం( halam ).అంటే నాగలి.

 Why Bapu Liked Halam So Much-TeluguStop.com

కానీ ఇది ఒక పేరు అని ఎంత మందికి తెలుసు.ఈ తరం వారికి ఇదేదో మాడ్రన్ పేరు గా కనిపించవచ్చు కానీ ఈ పేరు టాలీవుడ్( Tollywood ) చిత్రాల్లో శృంగార నృత్యాలు చేసిన ఒక నర్తకి ది అని మీకు తెలుసా ? తెలియకపోతే ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి.ఈ ఆర్టికల్ లో హలం అనే ఆ ఐటెం గర్ల్ ఎవరు ? దర్శకుడు బాపు ఆమెను ఎందుకు అంతలా ప్రోత్సహించాడో తెలుసుకుందాం.గుంటూరు లోని రేపల్లె ప్రాంతం లో పుట్టిన హలం తండ్రి పేరు శ్రీనివాస్( Srinivas ).అయన ఒక హేతువాది.తమిళనాడు లో సెటిల్ అయినా కుటుంబం లో హలం పుట్టింది.

హలం కి ఒక చెల్లి ఉంది ఆమె పేరు కలం.పేరుకు తగ్గట్టుగానే ఉపాధ్యాయ వృత్తిలో సెటిల్ అయ్యింది.హలం తమ్ముడు పేరు బలం.ఇంత విచిత్రంగా పేర్లు పెట్టారంటే ఆమె తండ్రి శ్రీనివాస్ గారి వ్యక్తిత్వం మన అర్ధం చేసుకోవచ్చు.

Telugu Actress Halam, Bapu, Halam, Halam Dance, Item Halam-Telugu Stop Exclusive

70 వ దశకం లో హలం ఒక సినిమాలో హీరోయిన్ గా నటించిన తెలుగు సినిమాల్లో అనేక ఐటమ్స్ నంబర్స్ చేసింది.జ్యోతి లక్ష్మి హవా తగ్గి జయమాలిని( Jayamalini ) స్పీడ్ అందుకోవడానికి మధ్యలో కొన్నాళ్ల పాటు హలం హడావిడి కనిపిస్తుంది.దర్శకుడు బాపు ఆమెను ముత్యాల ముగ్గు సినిమా ద్వారా పరిచయం చేసారు.అక్కడ నుంచి బాపు తీసిన దాదాపు అన్ని సినిమాల్లో కొన్నేళ్ల పటు శృంగార పాటల్లో డ్యాన్స్ చేసింది హలం.ఆమె ఎందుకో బాపు రమణలకు బాగా నచ్చింది.ముత్యాల ముగ్గు లో హలం పాత్రా చాల పెద్దదే.

ఆమెకు మంచి సీన్స్ కూడా పడ్డాయి.

Telugu Actress Halam, Bapu, Halam, Halam Dance, Item Halam-Telugu Stop Exclusive

ఈ సినిమా లో ఆమె నటన చూసి బాపు ముచ్చట పడి ఆమెను అన్ని సినిమాల్లో తీసుకునే వారు.ఎంతలా అంటే దోస్తీ అనే సినిమాను తెలుగు తీసిన బాపు వరిజినల్ లో ఒక ముసలి పాత్రా ఉంటె దానికి తెలుగు లో భర్త వదిలేసినా పాత్రా గా మార్చి అందులో హలం చేత నటింపచేసేంత నచ్చేసింది.ఇక 90 వ దశకం తర్వాత పూర్తిగా తెరమరుగైన హలం ఆ తర్వాత ఒక చైనా దేశీయుణ్ణి పెళ్లి చేసుకొని అక్కడికే వెళ్లి సెటిల్ అయ్యిందంటూ కొందరు అంటారు.

లేదు లేదు బెంగుళూరు లో ఒక బార్ ఓనర్ తో సెటిల్ అయ్యిందని మరికొందరు అంటారు.ఆలా తెర నుంచి నిష్క్రమించిన హలం మాత్రం అందరి మనస్సులో ఉండిపోయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube