సాధారణంగా కొందరి ముఖం ఎంతో తెల్లగా, అందంగా ఉంటుంది.మెడ మాత్రం నల్లగా, అందహీనంగా ఉంటుంది.
ముఖ్యంగా అమ్మాయిల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది.ఇక నిజం చెప్పాలంటే మెడ తెల్లగా ఉన్నప్పుడే ముఖం కూడా అందంగా కనిపిస్తుంది.
అందుకే మెడపై నలుపును పోగొట్టుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు.వేలకు వేలు ఖర్చు చేసి.
షాపుల్లో దొరికే క్రీములు అన్నీ కొనుగోలు చేసి ఉపయోగిస్తుంటారు.అయినప్పటికీ ఫలితం లేకుండా చింతిస్తుంటారు.
అయితే కొబ్బరి పాలతో న్యాచురల్‌గా మెడపై నలుపును పోగొట్టుకోవచ్చు.మరి కొబ్బరి పాలను ఎలా ఉపయోగించాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక బౌల్‌తో కొద్దిగా కొబ్బరి పాలు తీసుకుని అందులో కొద్దిగా శెనగపిండి మరియు బియ్యం పిండి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని మెడపై సర్కిలర్ మోషన్‌లో రుద్దుతూ అప్లై చేయాలి.
పవు గంట తర్వాత చల్లటి నీటితో శుభ్రంగా మెడను వాష్ చేసుకోవాలి.ఇలా వారినికి మూడు లేదా నాలుగు సార్లు చేయడం వల్ల మెడపై నలుపు తగ్గుముఖం పడుతుంది.

రెండొవది.ఒక బౌల్ తీసుకుంటే అందులో కొబ్బరి పాలు మరియు నిమ్మరసం రెండిటిని వేసి మిక్స్ చేసుకోవాలి.ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని మెడకు అప్లై చేసి.రెండు నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి.బాగా ఆరిన తర్వాత గోరు వెచ్చని నీటితో క్లీన్ చేసుకోవాలి.ఇలా రెగ్యులర్‌గా చేస్తూ ఉంటే.
మెడపై నలుపు క్రమంగా తగ్గి.తెల్లగా మారుతుంది.
మూడొవది.ఒక బౌల్‌తో కొబ్బరి పాలు, రోజ్ వాటర్, బాదం పొడి వేసి మూడిటిని మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మెడకు అప్లై చేసి.ఇరవై నుంచి ముప్పై నిమిషాల పాటు వదిలేయాలి.
ఆ తర్వాత గోరు వెచ్చని నీటితో మెడను శుభ్రం చేసుకోవాలి.ఇలా చేయడం వల్ల కూడా మెడపై నలుపు తగ్గుముఖం పడుతుంది.