దొరికేసాడు.. దొరికేసాడు.. ఇండియన్ స్పైడర్ మ్యాన్ ఇదిగో.. (వైరల్ వీడియో)

భారతదేశంలో రైలు ప్రయాణం( Train travel in India ) ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.సీటు దొరికితే ఎంత హాయిగా ఉంటుందో.

 Indian Spider-man (viral Video), Indian Railways, Train Journey, Viral Video, So-TeluguStop.com

దొరక్కపోతే అంతకంటే ఎక్కువగా కష్టంగా మారిపోతుంది.మనలో చాలామంది కొన్నిసార్లు సీటు కోసం పెద్ద యుద్ధమే చేసి ఉంటాము.

ఈ క్రమంలో చాలా మంది ప్రమాదాల బారిన పడిన ఘటనలు చాలానే చూశాం.సోషల్ మీడియాలో ఇలాంటి ఆసక్తికరమైన ఘటనలకు సంబంధించిన వీడియోలు తరచుగా వైరల్ అవుతుంటాయి.

తాజాగా, ఓ ప్రయాణికుడు చేసిన విచిత్ర విన్యాసాలు( Strange feats ) చూసి నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేసింది.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

ఈ వైరల్ వీడియోలో ఓ వ్యక్తి రైలులో ప్రయాణం చేస్తుండగా బోగీలో పరిస్థితి దారుణంగా కనిపించింది.జనసంద్రంలో కదలడానికి కూడా స్థలం లేకపోయినా, అతను ఎలాగైనా సీటు సంపాదించుకోవాలని ప్రయత్నించాడు.అయితే, సాధారణంగా చేసే ప్రయత్నాలు కాకుండా అతను సీట్లపైకి ఎక్కి, కాళ్లు ఒకదానిపై ఒకటి ఉంచుకుంటూ ముందుకు సాగిపోయాడు.చూస్తుండగానే చాలా దూరం వరకూ అటూ, ఇటూ కాలు మార్చుకుంటూ ఎంతో చాకచక్యంగా దూసుకుపోయాడు.

చివరకు, అటుపక్కనున్న సీట్లో కూర్చుని “హమ్మయ్య.సీటు దొరికేసిందిరోయి” అన్నట్లుగా తేలికపడ్డాడు.

ఈ ఘటనను తోటి ప్రయాణికులు వీడియో తీశారు.ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.ఇప్పటికే మిలియన్లలో వ్యూస్‌ను సొంతం చేసుకున్న ఈ వీడియోపై నెటిజన్లు వినోదభరితంగా స్పందిస్తున్నారు.వీడెవడండీ బాబు సీటు కోసం స్పైడర్ మ్యాన్ అయిపోయాడుగా.అంటూ కొందరు కామెంట్ చేయగా, వీడియో మధ్యలో ఉన్న అమ్మాయి ఎక్స్‌ప్రెషన్ సూపర్ అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

మరికొంతమంది ఫన్నీ ఎమోజీలతో తమ భావాలను వ్యక్తం చేస్తున్నారు.ఇలాంటి ఆసక్తికర వీడియోలు నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి.

రైళ్లలో క్షణం కూడా వెచ్చించడానికి వీలుకానంతగా ప్రయాణం కష్టతరంగా మారిన ఈ రోజుల్లో ప్రయాణికుల విన్యాసాలు వినోదానికి కారణంగా మారుతున్నాయి!

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube