గర్భం దాల్చిన మహిళలు ఒక అపురూపమైన అనుభూతిని పొందుతూ ఉంటారు.అలాంటి మహిళలకు ఇంట్లో పెద్దవాళ్ళు ఎన్నో జాగ్రత్తలు మెలకువలు చెబుతూ ఉంటారు.
ముఖ్యంగా ఆహార విషయంలో ఆచితూచి తీసుకోవాలి.ఆ సమయంలో ఏది తినవచ్చు ఏదో తినకూడదు అన్న విషయాలను తెలుసుకొని వాటిని అనుసరిస్తూ ఉండాలి.
అయితే గర్భం దాల్చిన మహిళలు నెయ్యి తినవచ్చా? తింటే ఎంత పరిమాణంలో తీసుకోవాలి? నెయ్యి ఎక్కువగా తీసుకుంటే ఎలాంటి సమస్యలు తలెత్తుతాయి? ఇలాంటి ఆలోచనలు ఎన్నో తలెత్తుతూ ఉంటాయి.అయితే నెయ్యి తినడం వల్ల ఎలాంటి ప్రభావాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం.
సాధారణంగా గర్భం దాల్చిన మహిళలలో ఎక్కువగా వాంతి, వికారం వంటి సమస్యలతో బాధ పడుతూ ఉంటారు.ఇలాంటి సమస్యలున్నవారు నెయ్యి తినకపోవడం మంచిదే.అంతే కాకుండా అధిక బరువు ఉన్నవారు కొద్దిగా తక్కువ నెయ్యి తినవచ్చు.
నెయ్యిలో ఉండే ఒమెగా 6, ఒమేగా 3, ఫ్యాటి ఆసిడ్లు, విటమిన్స్ సమృద్ధిగా ఉంటాయి.
నెయ్యిని గర్భిణీ మహిళలు తీసుకోవడం ద్వారా వారి బరువు పెరగడంతో పాటు శిశువు పెరుగుదలకు ఎంతో ఉపయోగపడుతుంది.
నెయ్యి తినడం వల్ల మన శరీరంలో మెటబాలిజం స్థాయి పెరుగుతుంది.
అయితే వీలైనంత వరకు ఇంట్లో సహజంగా తయారు చేసే నెయ్యిను తినడం వల్ల ఈ ప్రయోజనాలు అన్నింటిని పొందవచ్చు.
నెలలు పెరిగే కొద్దీ ఎక్కువ మోతాదులో నెయ్యిని తీసుకోవడం ద్వారా బిడ్డ పెరుగుదలతో పాటు, కండరాల కదలికకు ఎంతో తోడ్పడుతుంది.
దీని వల్ల బిడ్డ పొజిషన్ నార్మల్ స్థితిలోకి వచ్చి, సాధారణ డెలివరీ అయ్యేకి ఎంతో అవకాశం ఉంటుంది.
అధికంగా బరువు ఉన్నవారు నెయ్యి తీసుకోవడం ద్వారా మరింత బరువు పెరగడమే కాకుండా, శ్వాస తీసుకోవడం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు.
అందువల్ల అలాంటి వారు తక్కువ పరిమాణంలో నెయ్యి తీసుకోవడం ద్వారా ఎలాంటి సమస్యలు తలెత్తవు.