ఐశ్వర్యరాయ్, కరీనా కపూర్, దీపికా పదుకోనే, ఆలియా భట్, పరిణీతి చోప్రా, సోనమ్ కపూర్ .ఈ పేర్లు వింటేనే కుర్రాళ్ళ గుండెలు జారిపోతాయి.
అంతటి మహా అందగత్తెలు వీళ్ళు.వీరి అందం తమకు ఉండాలని, తమని చుస్తే కూడా కుర్రాళ్ళ హృదయాలు బలహీనం అయిపోవాలని ఏ అమ్మాయికి ఉండదు.
మరి ఈ భామలు చెప్పిన బ్యూటి సీక్రేట్స్ కొన్ని తెలుసుకుందామా !
* ఐశ్వర్యరాయ్ కి దోసకాయ అంటే చాలా ఇష్టం.ముఖానికి పట్టడంతో పాటు బాగా తింటుంది కూడా.
అలాగే పాలు, శనగపిండి కలిపి ముఖానికి రాసుకుంటూ ఉంటుంది.దీనివల్ల టాక్సీన్స్ వెళ్ళిపోతాయి.
తేనే, నిమ్మరసం కలిపి వాడటం కూడా ఐష్ కి బాగా అలవాటు.
* ఇక మూడు పదులు ఎప్పుడో దాటినా, ఇండస్ట్రీకి వచ్చి 16 ఏళ్ళు గడిచినా, కరీనా గ్లామర్ ఏమాత్రం తగ్గలేదు.
అందుకే మిగితా హీరోయిన్లలా కాకుండా, పెళ్ళి అయిపోయిన తరువాత కూడా హీరోయిన్ గా పెద్ద సినిమాలు చేసింది, హాట్ హాట్ గా ఐటమ్ సాంగ్స్ చేసింది.ఈ అమ్మడి బ్యూటి సీక్రేట్ తేనే.16 ఏళ్ళుగా తేనే శరీరానికి అప్లై చేస్తూనే ఉంది.
* ఆరోగ్యకరమైన జుట్టు కోసం కొబ్బరినూనెతో రెగ్యూలర్ గా మసాజ్ చేయించుకుంటుంది దీపికా.
అందుకే దీపికా లాంటి హెయిర్ స్టైల్ కావాలని హీరోయిన్లు కూడా స్టెట్మెంట్ ఇస్తుంటారు.
* ఐస్ క్యూబ్, ముల్తాని మిట్టి రోజూ వాడటం ఆలియా భట్ కి అలవాటు.
* పరిణితి చోప్రాకి అలోవెరాపై ఇష్టం ఎక్కువ.క్రమం తప్పకుండా అలోవెరా ప్యాక్ వాడుతుంది.
* సోనమ్ కపూర్ ఎక్కువగా శనగపిండి – పెరుగుతో చేసిన ఫేస్ ప్యాక్ ని వాడుతుందట.ఇక అందమైన జుట్టు కోసం ఆల్మండ్ ఆయిల్, కొబ్బరినూనె ఉపయోగిస్తుంది ఈ అనిల్ కపూర్ గారాలపట్టి.