మనిషి తరహాలో స్మోకింగ్ చేసిన పీత.. నెట్టింట్లో వైరల్!

ధూమపానం ఆరోగ్యానికి హానికరం అనే సంగతి మనకు తెలిసిందే.ఈ భూమిపై ఉన్న జంతువుల్లో మనిషి మాత్రమే సిగరెట్లు తాగుతాడని మనందరికి తెలుసు.

 Video Of Crab Smoking Cigarettes Goes Viral Crab Smoking, Cigarette, Cancer, Soc-TeluguStop.com

అయితే ఒక పీత సిగరెట్ తాగితే ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.పీత సిగరెట్ తాగిన ఫోటోలు, వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి.

మనుషులు ఏ విధంగా సిగరెట్ తాగి పొగ వదులుతారో పీత కూడా అదే విధంగా పొగ తాగడం గమనార్హం.స్టైల్ గా సిగరెట్ పీకను పట్టుకుని పీత సిగరెట్ తాగుతుండటం నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది.

మనుషులకు మాత్రమే సాధ్యమైన ధూమపానం తమకు కూడా సాధ్యమవుతుందని ఈ పీత ప్రూవ్ చేస్తోంది.ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ తో పాటు పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో పీత సిగరెట్ తాగుతున్న దృశ్యాలను వైరల్ చేశారు.

బీచ్ లో సిగరెట్ పీకను పీత కాలుస్తుండటంతో బీచ్ లో తిరిగే వాళ్లు ఆశ్చర్యానికి గురయ్యారు. 31 సెకండ్ల పాటు ఉన్న ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

వేల సంఖ్యలో ప్రజలు సిగరెట్ పీకను తాగుతున్న పీత వీడియోను చూసి వాళ్ల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.మనుషుల చెడు అలవాట్ల వల్ల పర్యావరణ కాలుష్యం జరుగుతున్న సంగతి తెలిసిందే.

అయితే మనుషులు కాల్చి పారేసిన సిగరెట్లను తాగితే జంతువుల ప్రాణాలకు అపాయం కలిగే అవకాశం ఉందని పలువురు జంతు ప్రేమికులు కామెంట్లు చేస్తున్నారు. సిగరెట్ పీకలను ఎక్కడ పడితే అక్కడ పడేయవద్దని సూచిస్తున్నారు.

మరి కొందరు మాత్రం మనుషులు సిగరెట్ తాగితే క్యాన్సర్ వస్తుందని ఈ పీతకు క్యాన్సర్ వస్తుందో లేదో చెప్పాలని కామెంట్లు చేస్తున్నారు.పీత సిగరెట్ తాగుతున్న ఘటన ఎక్కడ చోటు చేసుకుందనే వివరాలు మాత్రం తెలియాల్సి ఉంది.

మనం వాడి పడేసిన వ్యర్థాల వల్ల ఇతర జీవుల ప్రాణాలకు అపాయం కలగకూడదని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube