మొటిమలు. యువతీ, యువకుల్లో ప్రధానంగా వేధించే చర్మ సమస్యల్లో ఇది ఒకటి.యవ్వనం ప్రారంభం కాగానే మొదలయ్యే ఈ మొటిమలు.చాలా తీవ్రంగా ఇబ్బంది పెడుతుంటాయి.ముఖ్యంగా ఈ చలి కాలంలో మొటిమల సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. పొల్యూషన్, హార్మోన్ల లోపం, ఆయిలీ స్కిన్, ఆహారపు అలవాట్లు ఇలా రకరకాల కారణాల వల్ల మొటిమల సమస్య ఇబ్బంది పెడుతుంటుంది.
అయితే మొటిమల సమస్య ఉండకూడదు అని భావించే వారు ఇప్పుడు చెప్పబోయే ఆహారాలను డైట్‌లో చేర్చుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
మరి ఆ ఆహారాలు ఏంటీ అన్నది లేట్ చేయకుండా ఓ లుక్కేసేయండి.
నట్స్ అంటే బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పు, వాల్ నట్స్ వంటి డైలీ డైట్‌లో చేర్చుకోవాలి.ఎందుకంటే, నట్స్‌లో ఉండే ఉండే ప్రోటీన్స్, మినరల్స్ మరియు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చర్మంలో అదనపు జిడ్డును తొలిగించి.మొటిమల సమస్యను తగ్గిస్తుంది.

అలాగే పాల కూర, మెంతి కూర, బ్రొక్కొలి, క్యాబేజ్ వీటిలో ఏదో ఒక దానిని రోజు తినే ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.ఎందుకంటే, ఆకుకూరలు చర్మానికి ఎంతో మేలు చేస్తాయి.ముఖ్యంగా ఇప్పుడు చెప్పుకున్న ఆకుకూరలు మొటిమలను రాకుండా చేయడంలో గ్రేట్‌గా సహాయపడతాయి.
విటమిన్ సి మొటిమలను నివారించడంలో సూపర్‌గా సహాయపడుతుంది.కాబట్టి, విటమిన్ సి పుష్కలంగా ఉంటే ఆరెంజ్, నిమ్మ, బొప్పాయి వంటి తీసుకోవాలి.
ఇక గ్రీన్ టీ గురుంచి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.వెయిట్ లాస్ అయ్యేందుకు చాలా మంది రెగ్యులర్‌గా గ్రీన్ టీ సేవిస్తుంటారు.అయితే మొటిమలను తగ్గించడంలోనూ గ్రీన్ టీ ఉపయోగపడుతుంది.గ్రీన్ టీ తాగినా.
.ముఖానికి పూసుకున్నా మొటిమలకు దూరంగా ఉండొచ్చు.
అలాగే యాపిల్ తినడం వల్ల కూడా మొటిమలకు చెక్ పెట్టవచ్చు.అందువల్ల, రెగ్యలర్‌గా ఓ యాపిల్ తీసుకోండి.
వీటితో పాటు తక్కువ ఫ్యాట్ ఉన్న ఫుడ్ తీసుకోవాలి.