లక్ష్మీదేవికి కుమారునిగా గణేశుడు.. ఈ ఆసక్తికర పౌరాణిక గాథ గురించి మీకు తెలుసా?

గణేశుడు.పార్వతీపరమేశ్వరుల కుమారుడు.

 Ganesha As The Son Of Lakshmi Devi-TeluguStop.com

అయితే శ్రీమహాలక్ష్మి కూడా గణేశుడిని తన కుమారునిగా భావిస్తుందని మీకు తెలుసా ? గణపతిని లక్ష్మీదేవి దత్తపుత్రునిగా చెబుతారు.దీపావళి నాడు.

లక్ష్మీ దేవి, గణపతులను తల్లీకుమారుల రూపంలో పూజిస్తారు.లక్ష్మీ సమేతంగా గణపతిని పూజిస్తే ఆ తల్లి ఎంతో సంతోషిస్తుందని, అటువంటి భక్తులకు అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని చెబుతారు.

గణేశుడు.శ్రీమహాలక్ష్మికి కుమారుడు ఎలా అయ్యాడనే దాని వెనుక ఒక పురాణ కథ ఉంది.

దానిని ఇప్పుడు తెలుసుకుందాం.జగత్తును పోషించే శ్రీమహావిష్ణువు భార్య కనుక లక్ష్మిదేవిని జగత్ జనని అని పిలుస్తారు.

ఈ ప్రపంచమంతా అమ్మవారి ప్రేమ, మాయలతో నడుస్తుందని చెబుతారు.పురాణాల ప్రకారం.

ఒకప్పుడు లక్ష్మీదేవి.ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ లక్ష్మిని మాత్రమే కలిగి ఉండాలని కోరుకుంటున్నారని తెలిసి గర్వపడిందట.

తన అనుగ్రహం లేకుండా ఎవరికీ ఏ పనీ జరగదని భావించిందట.అయితే శ్రీ హరి.అమ్మవారి ఈ అహంకారాన్ని పసిగట్టాడట. లక్ష్మీదేవి అహంకారాన్నిఅంతం చేయడం చాలా అవసరమని భావించాడట.

ఈ నేపధ్యంలో శ్రీహరి.అమ్మవారితో ప్రపంచం మొత్తం నీ అనుగ్రహం కోసం ఆరాటపడుతోంది.

అయినప్పటికీ నువ్వు అసంపూర్ణంగా ఉన్నావు అని అన్నాడు.నారాయణుని మాటలు విన్న.

లక్ష్మిదేవి చాలా బాధ పడుతూ.తాను ఎలా అసంపూర్ణురాలినని అడిగిందట.

అప్పుడు మహా విష్ణువు ఆమెతో.ఒక స్త్రీ తల్లి కానంత వరకు ఆమె సంపూర్ణం కాదని చెప్పాడట.

దీనిని గ్రహంచిన లక్ష్మి అమ్మవారు.వేదనకు గురై తన స్నేహితురాలు పార్వతి వద్దకు వెళ్లి.

తన మనసులోని మాటను చెప్పిందట.సంతానం లేకపోవడమనేది చాలా బాధాకరమని.

నీ ఇద్దరు కుమారులలో ఒకరిని తనకు దత్తత ఇవ్వాలని కోరిందట.దీనికి పార్వతీ మాట సమ్మతిస్తూ, లక్ష్మిదేవికి.

గణపతిని అప్పగించిందట.అప్పటి నుండి గణపతిని.

శ్రీమహాలక్ష్మికి దత్తపుత్రుడని పిలుస్తారు.

Story of Lakshmi Devi adopting Ganesha Devotional Story

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube