కొమురవెల్లి మల్లన్న పుణ్యక్షేత్రం భక్తజన సంద్రం..

మల్లన్న స్వామి నన్నేలు స్వామి,కొర మీసాల స్వామి కోటి దండాలు స్వామి అంటూ కొమురవెల్లి పుణ్యక్షేత్రం మార్మోగిపోతుంది.స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో ఆదివారం లష్కర్‌ వారాన్ని పురస్కరించుకొని సికింద్రాబాద్ తో పాటు కరీంనగర్, మెదక్, వరంగల్ ఉమ్మడి జిల్లాలకు చెందిన దాదాపు 40 వేల మంది భక్తులు మల్లన్న పుణ్యక్షేత్రానికి తరలివచ్చారు.

 Komuravelli Mallanna Shrine Is A Place Of Devotees ,komuravelli Mallanna , Lashk-TeluguStop.com

ఉదయం 5 గంటల నుంచి మల్లన్న దర్శన భాగ్యాన్ని దేవాలయాధికారులు కల్పించారు.

Telugu Bakti, Devotional, Komuravellisri, Lashkar-Telugu Bhakthi

భక్తులు ప్రత్యేక పూజలు చేసి పట్నాలు వేసి బోనాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి.అంతేకాకుండా కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలుగా ఎంతో ఘనంగా జరుగుతున్నాయి.

ఆదివారం లష్కర్ వారం సందర్భంగా మల్లన్న క్షేత్రానికి భారీగా భక్తుల తరలి వచ్చారు.లష్కర్ వారాన్ని పురస్కరించుకొని సికింద్రాబాద్ తో పాటు వరంగల్ ఉమ్మడి జిల్లా నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున స్వామివారి దర్శనం కోసం తరలివచ్చారు.

Telugu Bakti, Devotional, Komuravellisri, Lashkar-Telugu Bhakthi

శనివారం సాయంత్రం నుంచి భక్తులు ఆర్టీసీ బస్టాండ్, ప్రైవేట్ వాహనాల్లో మల్లన్న క్షేత్రానికి భారీగా చేరుకున్నారు.ఆదివారం దర్శనం కోసం క్యూ లైన్ లలో భారీగా భక్తుల రద్దీ ఏర్పడింది.భక్తుల రద్దీ భారీగా కనిపించడంతో దేవాలయ అధికారులు ఉదయం ఐదు గంటల నుంచి దర్శనానికి అనుమతించారు. ప్రత్యేక దర్శనం, శీఘ్ర దర్శనం, ధర్మ దర్శనం కోసం కౌంటర్లు తెరిచి భక్తులకు టికెట్లను విక్రయించారు.

Telugu Bakti, Devotional, Komuravellisri, Lashkar-Telugu Bhakthi

ఈ పుణ్య కార్యక్రమంలో దేవాలయ కమిటీ చైర్మన్ గిస బిక్షపతి, ధర్మకర్తలు, ఏఈఓ వైరాగ్యం అంజయ్య, సూపరింటెండెంట్లు నేల శేఖర్, శ్రీనివాస్ శర్మ, ఆలయ ప్రధాన అర్చకుడు మహాదేవుని మల్లికార్జున్, అర్చకులు, పూజారులు భక్తులకు సేవలు అందించారు.హుస్నాబాద్ ఏసీబీ సతీష్ ఆధ్వర్యంలో పలువురు ఎస్సైలు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.భక్తులు గంటల పాటు క్యూలైన్లలో నిలబడి మల్లన్న ను దర్శించుకున్నారు.అభిషేకం, అర్చన, వడిబియ్యం, కొబ్బరికాయలు, పట్నాలు, బోనాలు తదితర రూపంలో భక్తులు మొక్కలను చెల్లించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube