వర్షాకాలంలో మన దేశమంతా భారీ వర్షాలు కురుస్తుండడంతో ఎక్కడ ఏ ప్రమాదం జరుగుతుందో అని ప్రజలు దూర ప్రయాణాలు చేయడం మానేస్తుంటారు.ఇంకా చెప్పాలంటే భారీగా మంచు కొండలు ఉన్న ఉత్తరఖండ్ లోని కేదార్ నాథ్ ఆలయానికి భక్తులకు వర్షాకాలంలో ప్రవేశం ఉండదు.
ఎందుకంటే వర్షాకాలంలో ఆలయం చుట్టూ పెద్ద పెద్ద మంచు కొండలు ఉండడం వల్ల అక్కడ మంచి తుఫాను ఏర్పడి ఆలయం మంచులో కప్పబడి ఉంటుంది.
కాబట్టి వర్షాకాలంలో భక్తులు వెళితే ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది.
ఉత్తరాఖండ్‌లోని పవిత్రక్షేత్రమైన కేదార్‌నాథ్ ఆలయం చుట్టూతా ఉన్న పర్వతాలపై భారీ హిమపాతం వచ్చి పడింది.ఈ ఘటన ఆలయానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న చోరాబరి గ్లేసియర్ పరిసర ప్రాంతంలో జరిగింది.
దీనివల్ల రుద్రప్రయాగ్‌లో ఎలాంటి ఆస్తి నష్టం గాని, ప్రాణ నష్టం గానీ జరగలేదని ఈ ప్రాంతాన్ని పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.
రుద్రప్రయాగ్‌లోని జాతీయ రహదారిని బ్లాక్ చేసిన కొద్ది క్షణాల ముందే ఈ హిమపాతం సంభవించడం గమనార్హం.
ఈ హిమపాతం కారణంగా కొండచరియలు విరిగిపడి తర్సాలి గ్రామ సమీపంలోకి ప్రమాదకరంగా వచ్చి పడ్డాయి.వాస్తవానికి ఉత్తరాఖండ్‌లో గత కొన్ని రోజులుగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి.
ఇంకా వాతావరణ శాఖ రానున్న రెండు రోజుల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది.అయితే, ఇప్పుడు మధ్య ఉష్ణమండల పశ్చిమాలలో ఒక ద్రోణి ఏర్పడిందని, ఇది పశ్చిమంగా కదలడంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ వెల్లడించింది.
ఆ తరువాత ఈ ద్రోణి వాయువ్య భారతదేశం వైపుగా కొనసాగే అవకాశం ఉందని తెలిపింది.అలాగే రానున్న రోజుల్లో మధ్యప్రదేశ్, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్, అస్సాం, మేఘాలయాల్లో కూడా విస్తారంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.ఈఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.