దీపావళి పండుగ( Diwali ) దగ్గరకు వచ్చేసింది.మన తెలుగు రాష్ట్రాల్లో ధన త్రయోదశి( Dhanatrayodashi )నీ ధనవంత్రి త్రయోదశి అని జరుపుకుంటారు.
అయితే లక్ష్మీదేవి, కుబేరుడిని ధన త్రయోదశి నాడు పూజిస్తారు.ధనవంత్రి త్రయోదశి నాడు ఎలాంటి పనులు చేస్తే లక్ష్మీదేవి కటాక్షాలు లభిస్తుందో, అదే విధంగా ఎలాంటి పనులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.
ధన త్రయోదశి నాడు ఎవరికీ కూడా అప్పు ఇవ్వడం అస్సలు మంచిది కాదు.లక్ష్మీదేవిని మీ ఇంటికి ఆహ్వానించాలే కానీ వేరొక ఇంటికి మాత్రం పంపించకూడదు.
ఐరన్, అల్యూమినియం లాంటి వస్తువులు అస్సలు కొనకూడదు.

ముఖ్యంగా ఐరన్ కుక్కర్ మాత్రం అస్సలు కొనకూడదు.కొత్త వస్తువులను కూడా ఇంటికి తెచ్చుకోకూడదు.అంతేకాకుండా నలుపు రంగుకి సంబంధించిన ఎలాంటివి కూడా కొనుగోలు చేయకూడదు.
చీపురు లక్ష్మీదేవితో సమానం అని అంటుంటారు.కాబట్టి ఆ రోజు చీపురు కొనడం మంచిది.
బంగారం కొన్నా కూడా చాలా మంచిది.ఆ రోజున ఉప్పు, ధనియాలు కొంటే చాలా మంచిది.
అలాగే నీటిలో కాస్త ఉప్పు వేసి ధన త్రయోదశి రోజున ఇల్లు మొత్తం శుభ్రం చేసుకుంటే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది.అలాగే మనం చేసే పూజల్లో కూడా ధనియాలు వాడాలి.
అలా వాడడం చాలా మంచిది.

ఇక ధన త్రయోదశి రోజున ఎలక్ట్రిక్ వస్తువులు( Electric goods ) అలాగే వాహనాలు వంటివి కొనకపోవడమే చాలా ఉత్తమం.అయితే దానికి బదులుగా ధన త్రయోదశి ముందు రోజు ఈ వస్తువులకు కావాల్సిన పేమెంట్ చేసుకోవచ్చు.కానీ ధన త్రయోదశి రోజున మాత్రం మీ నుంచి డబ్బు పోయే పని ఏదైనా గాని అస్సలు చేయకూడదు.
ఎందుకంటే డబ్బు లక్ష్మీదేవితో సమానం అని మనందరికీ తెలిసిందే.ఎప్పటికైనా గాని మన ఇంటికి లక్ష్మీదేవిని స్వాగతించాలి.కానీ ఎప్పుడు కూడా మన ఇంట్లో ఉన్న మన లక్ష్మి దేవిని బయటికి పంపించేందుకు ప్రయత్నించకూడదు.కాబట్టి మన ఇంటి నుండి డబ్బులు వెళ్ళే రకంగా ఏది కూడా కొనుగోలు చేయకూడదు.
మన ఇంటి నుండి డబ్బు వెళ్లేలా ఎలాంటి పనులు కూడా అస్సలు చేయకూడదు.