తమలపాకు లేని పూజ శుభకార్యాలు అసంపూర్ణం అని ఎందుకు చెబుతారో తెలుసా..?

హిందూ ధర్మంలో దైవ పూజకు ప్రత్యేక స్థానం ఉంది.పూజా సమయంలో ఉపయోగించే ద్రవ్యాలకు విశిష్ట స్థానం ఉంది.

 Do You Know Why It Is Said That Puja Without Betel Leaf Is Incomplete , Lakshm-TeluguStop.com

పూజా కార్యక్రమాలలో తమలపాకును సమర్పించడం ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు.తమలపాకుని పూజలలో ఉపయోగించే సంప్రదాయం ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతుంది.

ముఖ్యంగా లక్ష్మీదేవి, గణపతి పూజ సహా ఇతర పూజలు వ్రతాల సమయంలో తమలపాకును ఉపయోగిస్తారు.ఏదైనా కారణాల వల్ల తమలపాకులను పూజలో చేర్చకపోతే ఆ పూజ ఆసంపూర్ణంగా భావిస్తారు.

ఇంకా తమలపాకు ఉన్న ప్రాముఖ్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ఇంకా చెప్పాలంటే ఐశ్వర్యం శ్రేయస్సును ఇచ్చే లక్ష్మీదేవి( Lakshmi Devi ) ఆశీర్వాదం కోసం పూజా కార్యక్రమాలలో తమలపాకును ఉపయోగిస్తారు.

Telugu Bhakti, Devotional-Latest News - Telugu

తమలపాకులో ఉన్న స్వభావిక లక్షణాలు భక్తులకు సానుకూల శక్తిని దైవిక ఆశీర్వాదాన్ని ఆకర్షిస్తాయని ప్రజలు నమ్ముతారు.ఆరాధనలో ఏకాగ్రత కలిగిస్తుంది.హిందూ మతంలో తమలపాకు త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణువు, శివుడిని సూచిస్తాయి.పూజా సమయంలో తమలపాకును సమర్పించడం అనేది దైవిక శక్తుల పట్ల భక్తిని వ్యక్తపరిచే శుభమైనా మార్గం అని ఈ పండితులు చెబుతున్నారు.

పారాయణం, పూజల సమయంలో తమలపాకులు,పండ్లు ఉంచి తంబులంగా ఆచారాల ప్రకారం దేవత మూర్తులకు సమర్పిస్తారు.చాలా ప్రదేశాలలో పూజా సమయంలో తమలపాకుల పై కర్పూరం ఉంచి వెలిగిస్తారు.

ఇలా చేయడం వల్ల ఇంట్లోకి సానుకూల శక్తి వస్తుంది.

Telugu Bhakti, Devotional-Latest News - Telugu

ప్రాచీన హిందూ గ్రంథం స్కంద పురాణాల్లో తమలపాకు గురించి ప్రస్తావించబడింది.పూజలో తమలపాకును ఉపయోగించడం వెనుక సముద్ర మథనానికి సంబంధించిన కథనాన్ని ప్రస్తావించారు.రాక్షసులు అమృతం కోసం అమృతాన్ని పొందేందుకు సముద్రం మథనానికి చేసిన సమయంలో దైవిక వస్తువులు ఉద్భవించాయి.

వీటిల్లో ఒకటి తమలపాకు అని పండితులు చెబుతున్నారు.ఈ ఆకు ప్రస్తావన మహాభారతం అంటే ఇతిహాసాలలో కూడా ప్రస్తావించబడింది.

దీని కారణంగా దీనిని హిందూ ఆచారాలలో భాగం చేయడం తప్పనిసరిగా భావిస్తారని పండితులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube