ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలలో శ్రీశైలం పుణ్యక్షేత్రం కూడా ఒకటి.ఈ పుణ్యక్షేత్రానికి ప్రతిరోజు దేశ నలుమూలల నుంచి ఎంతోమంది భక్తులు వచ్చి పూజలు చేస్తూ ఉంటారు.
అంతే కాకుండా శ్రీశైల క్షేత్రంలో మార్గశిర శుద్ధ పౌర్ణమిని ఎంతో ఘనంగా బుధవారం శ్రీశైల గిరి ప్రదక్షణ కార్యక్రమాన్ని దేవస్థానం వైభవంగా చేసింది.సాయంత్రం స్వామి అమ్మవార్ల మహా మంగళ హారతుల అనంతరం స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు చేసి పల్లకిలో ఊరంతా ఊరేగింపుతో గిరి ప్రదక్షణ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు.
ఈ గిరి ప్రదక్షణ కార్యక్రమం ఆలయ రాజ గోపురం నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమై గంగాధర మండపం, అంకాలమ్మ ఆలయం, నందిమండపం, మల్లికార్జున సందనం, బయలు వీరభద్ర స్వామి ఆలయం అక్కడి నుంచి వలయదారి మీదుగా ఆలయ మహాద్వారం చేరుకోవడంతో శ్రీశైల గిరి ప్రదక్షిణ కార్యక్రమం ముగిసిపోతుంది.ఇంకా చెప్పాలంటే శ్రీశైల పుణ్యక్షేత్రంలో గురువారం మార్గశిర శుద్ధ పౌర్ణమి జరుపుకొని సాయంత్రం భ్రమరాంబ అమ్మవారికి లక్ష కుంకుమార్చనను సమర్పించారు.
భక్తులు వారి గోత్రనామాలతో లక్ష కుంకుమార్చనలలో పాల్గొనేందుకు దేవస్థానం పరోక్ష సేవ ద్వారా అవకాశం కల్పించింది.
ఈ కార్యక్రమంలో ముందుగా అర్చక స్వాములు పూజ సంకల్పం పాటించి ఆ తర్వాత ఆ మహా గణపతికి పూజలు చేశారు.తర్వాత లక్ష కుంకుమార్చనను ఎంతో ఘనంగా జరిపించారు.శ్రీశైల క్షేత్రానికి స్వయంగా చేయలేని భక్తులు వారి గోత్రనామాలతో ఆయా ఆర్జిత సేవలలో పాల్గొనందుకు ఆన్లైన్ ద్వారా 1116 రూపాయలు ఈ సేవకులను రుసుమును చెల్లించి పరీక్ష సేవలో కూడా పాల్గొనే అవకాశాన్ని దేవస్థాన అధికారులు కల్పించారు.
భక్తులు ఈ పరోక్ష సేవలో అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని దేవస్థానం ఈవో ఎస్ లవన్న తెలిపారు.
DEVOTIONAL