శ్రావణమాసం గురించి కొన్ని ముఖ్యమైన అంశాలు ఇవే..!

జ్యోతిష్య శాస్త్రం( Astrology ) ప్రకారం చంద్రుడు శ్రావణ నక్షత్రానికి దగ్గరగా ఉండడం వల్ల ఈ మాసనికి శ్రావణ మాసము అని పేరు వచ్చింది.శ్రావణమాసం గురించి కొన్ని ముఖ్యమైన అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

 Here Are Some Important Facts About Shravanamasam, Astrology, Moon, Kuja Dosha,-TeluguStop.com

శ్రీమన్నారాయణ యొక్క జన్మ నక్షత్రము శ్రావణ నక్షత్రము.శ్రావణమాసము లక్ష్మీదేవి కి ఎంతో ఇష్టమైనది.

దేవతలు సముద్ర మథనాన్ని ప్రారంభించింది కూడా ఈ మాసంలోనే.ఇంకా చెప్పాలంటే పాల సముద్రాన్ని చిలుకుతున్నప్పుడు హాలాహలము బయటకు రాగా దేవతలు శివుడిని ప్రార్థిస్తారు.

తన మాంగల్యబలం పై నమ్మకముతో గౌరీదేవి కూడా శివుడిని ఇదే కోరుతుంది.

Telugu Astrology, Bhakti, Devotional, Goddess Parvati, Kuja Dosha, Sravanamasam-

ఈ సృష్టి దేవతలు అందరూ మన సంతానమేనని వారిని రక్షించుట మన బాధ్యత అని చెప్పి శివున్ని ఆ గరళాన్ని స్వీకరించమని కోరుతుంది.శివుడు లోకాన్ని రక్షించినందుకు శ్రావణమాసంలో సోమవారాలు శివరాధన కూడా చేస్తారు.శివుడిని పంచామృతాలతో అభిషేకం చేస్తారు.

అమ్మవారి మాంగళ్యం బలం చేత శివుడు ఈ పని చేస్తాడు.కాబట్టి శ్రావణ మంగళవారాలు మంగళ గౌరీవ్రతాన్ని( Mangala Gourivrata ) కూడా ఆచరిస్తారు.

జాతకం( Horoscope )లో కుజదోషము, కాలసర్భ దోషము రాహుకేతు వంటి దోషాలు ఉన్నవారు మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరిస్తే దోష నివృత్తి అవుతుందని విశ్వాసం.

Telugu Astrology, Bhakti, Devotional, Goddess Parvati, Kuja Dosha, Sravanamasam-

శ్రావణమాసంలో బుధవారాలు మహావిష్ణువును పూజించడం విశేషం.ఈ రోజున విష్ణు సహస్ర నామము వంటివి పారాయణ చేసిన వారికి స్వామి వారి కృప ఎప్పుడూ లభిస్తుంది.జీవితంలో దుఃఖములు, కష్టామూల నుంచి బయటకు రావడానికి వరలక్ష్మి వ్రతాన్ని మించిన వ్రతము లేదు అని పండితులు చెబుతున్నారు.

లోకంలో మహిళలు సకల ఐశ్వర్యాలతో పుత్రపౌత్రాదులను పొందేటటువంటి వీలున్న ఏదైనా ఒక వతమును సూచించమని పార్వతీదేవి( Goddess Parvati ) అడగగా పరమేశ్వరుడు వరలక్ష్మీ వ్రతం సూచించినట్లు పురాణాలు చెబుతున్నాయి.శ్రావణమాసంలో సోమవారాలు శివరాధన, మంగళవారాలు శక్తి ఆరాధన, బుధవారాలు విష్ణు భగవానుని ఆరాధన, శుక్రవారం లక్ష్మీదేవి ఆరాధన చేయడం వల్ల సత్ఫలితాలు పొందవచ్చని పండితులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube