సాధారణంగా హిందువులు ఎన్నో రకాల వృక్షాలను, మొక్కలను దైవ సమానంగా భావిస్తారు.ఈ క్రమంలోనే దైవ సమానంగా భావించే మొక్కలకు పూజలు చేస్తూ ఉంటారు.
ఇలా దైవ సమానంగా భావించి మొక్కలను ఇంటి ఆవరణంలో పెంచుకోవడానికి చాలా మంది ఇష్టం చూపుతుంటారు.ఈ విధమైనటువంటి దేవతా వృక్షాలలో ఒకటిగా ఎంతో ప్రసిద్ధి చెందిన వృక్షాలలో రావి చెట్టు ఒకటి.
రావిచెట్టులో సాక్షాత్తూ శ్రీమన్నారాయణుడు, సకల దేవతలు కొలువై ఉంటారని భావిస్తారు అందుకోసమే రావి చెట్టుకు పెద్ద ఎత్తున పూజలు చేస్తూ ప్రదక్షిణలు చేస్తుంటారు.
దైవ సమానమైన ఈ రావిచెట్టును ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఇంటిలో పెట్టకూడదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
ఇంట్లో రావి చెట్టు ఉండటంవల్ల ఎల్లప్పుడు ఇంట్లో ప్రతికూల వాతావరణం ఏర్పడుతుందని దీని వల్ల ఎన్నో రకాల సమస్యలు, గొడవలు, ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయని అందుకోసమే రావిచెట్టును ఇంట్లో ఉంచకూడదని చాలా మంది చెబుతుంటారు.
ఆధ్యాత్మికపరంగా రావిచెట్టును ఇంట్లో ఉంచుకోక పోవడం ఇది ఒక కారణం అయినప్పటికీ, ఎత్తైన వృక్షాలను ఇంటి ఆవరణంలో పెట్టుకోవటం వల్ల మన ఇంట్లోకి వచ్చేటటువంటి పాజిటివ్ ఎనర్జీ, వెలుతురును ఇంట్లోకి రాకుండా ఆపుతుంది.అందుకోసమే ఇంట్లో ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఏర్పడతాయి.అందుకోసమే రావిచెట్టును ఇంట్లో పెంచకూడదు.
ఒకవేళ పెట్టిన వెంటనే దానిని వేళ్లతో సహా తీసుకెళ్లి మరొక చోట నాటడం ఎంతో ఉత్తమం.
DEVOTIONAL