వెంటిలేటర్ మీద అరియనా.. ఆక్సీజన్ లెవెల్స్ పడిపోవడంతో?

బిగ్ బాస్ సీజన్ 4 బోల్డ్ బ్యూటీ అరియానా.బోల్డ్ అంటూ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి.తన మాటలతో అందరినీ ఆశ్చర్యపరిచింది.పైగా ముక్కుసూటి అమ్మాయిగా పేరు తెచ్చుకుంది.హౌస్ లో ఉన్నంత కాలం గేమ్ లో బాగా పాల్గొన్నది.మొత్తానికి బిగ్ బాస్ తో సెలబ్రిటీగా మారింది అరియానా.

 Bigg Boss Fame Ariyana Glory With Oxygen Mask Photo Going Viral In Social Media,-TeluguStop.com

ఈ షోతో మంచి ఫాలోయింగ్ కూడా సంపాదించుకుంది.

సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.

నిజానికి బిగ్ బాస్ ముందు ఈమె ఎవరో కూడా ఎవరికీ తెలియదు.బిగ్ బాస్ ముందు యూట్యూబ్ లో ఇంటర్వ్యూ చేస్తుండేది.

అలా ఓ సారి డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తో ఇంటర్వ్యూ చేసి ఎనలేని క్రేజ్ సంపాదించుకుంది.పైగా వర్మ చేసిన బోల్డ్ కామెంట్స్ తో అరియానా కెరీర్ మలుపు తిరిగింది.

ఇటీవలే కూడా వర్మతో బోల్డ్ ఇంటర్వ్యూ చేసిన సంగతి తెలిసిందే.

ఇక సోషల్ మీడియా వేదికగా నిత్యం హాట్ ఫోటోలను, వీడియోలను బాగా షేర్ చేసుకుంటుంది.

Telugu Ariyana Glory, Ariyana, Bigg Boss Show, Kalyan Dev, Ram Gopal Varma-Movie

తాజాగా తన ఇన్ స్టా గ్రామ్ వేదికగా ఓ వీడియో షేర్ చేసుకుంది అరియానా.అందులో బెడ్ పై పడుకొని ఉండడమే కాకుండా తన మూతికి ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయినట్లు మాస్క్ కూడా ధరించుకున్నట్లు కనిపించింది.ప్రస్తుతం ఈ వీడియోకి సంబంధించిన స్క్రీన్ షాట్ ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారింది.ఇక ఇది చూసిన నెటిజన్లు అరియానా ఏం జరిగిందో అని తెగ కామెంట్స్ చేస్తున్నారు.

Telugu Ariyana Glory, Ariyana, Bigg Boss Show, Kalyan Dev, Ram Gopal Varma-Movie

కానీ అసలు విషయం ఏంటంటే ప్రస్తుతం ఈ బ్యూటీ వరుస ప్రాజెక్ట్ లలో బిజీగా ఉంది.అంతేకాకుండా సినిమాలలో కూడా అవకాశాలు అందుకుంది.ఇక మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ నటిస్తున్న ఓ సినిమాలో అరియానాకు అవకాశం రాగా అందులో భాగంగా ఓ పాత్రలో తను ఆక్సిజన్ మాస్క్ ధరించి వెంటిలేటర్ లో ఉన్నట్లు నటించింది.ఇక ఈ షూటింగ్ భాగంలో తీసిన వీడియోను షేర్ చేయగా ప్రస్తుతం అది వైరల్ గా మారింది.

మొత్తానికి వర్మతో ఇంటర్వ్యూ సినిమా అవకాశాల వరకు తీసుకువచ్చిందని చెప్పవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube