యూఏఈలో పొట్టి ప్రపంచ కప్‌ - 2021..?!

ఈసారి భారత్ లో జరగాల్సిన టీ-20 ప్రపంచ కప్‌ శ్రీలంక లేదా యూఏఈ లో పెట్టేందుకు బీసీసీఐ ప్లాన్ చేసిన విషయం తెలిసిందే.అయితే చివరగా యూఏఈ ని ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది.

 Bcci Finalized Uae For The T20 Cricket World Cup 2021 , Uae, World Cup, 2021, Ma-TeluguStop.com

ఈ క్రమంలో టీ20 ప్రపంచ కప్‌ ను అక్టోబర్‌ 17వ తేది నుంచి యూఏఈలో ప్రారంభం కానుంది.అలాగే నవంబర్ 14వ తేదిన ఫైనల్ నిర్వహించనున్నారు.

ఇందుకోసం బీసీసీఐ షెడ్యూల్‌ ను తయారు చేసింది.అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీకి తన నిర్ణయాన్ని తెలియజేనున్నట్లు బీసీసీఐ అధికారులు తెలిపినట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఈ టోర్నమెంట్ లో మొత్తంగా చూస్తే 16 దేశాలు పాల్గొననున్నట్లు సమాచారం.యూఏఈలో మొత్తం 3 వేదికలు ఉన్నాయి.

అవి అబుదాబి, షార్జా, దుబాయ్ లో ఉన్నటువంటి టీ20 పోటీలు నిర్వహిస్తున్నారు.అలాగే టీ20 ప్రపంచ కప్ క్వాలిఫయర్స్‌ మ్యాచ్‌ లకు ఒమన్ ఆతిథ్యం ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది.

భారతదేశంలోనే టీ20 ప్రపంచ కప్‌ ను నిర్వహించాలని మొదటగా అనుకున్నారు.అయితే బీసీసీఐకి రెండు సమస్యలు వచ్చాయి.భారత ప్రభుత్వం నుంచి ఏ రకమైన టాక్స్‌ మినహాయింపు కూడా లభించలేదు.అలాగే కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఐపీఎల్‌ ను ప్రతిసారి వాయిదా వేసిన సంగతి తెలిసిందే.

దీనివలన మళ్లీ విదేశీ ఆటగాళ్లు భారత్ కు వచ్చేందుకు ఒప్పుకుంటారని అనుమానాలు ఉన్నాయి.బీసీసీఐ ఫైనల్‌ గా యూఏఈని ఖరారు చేసినట్లు తెలిపింది.

Telugu Bcci, Covid Effect, Dubai, Icici, Matchs, Oman, Sharjah, Cup-Latest News

అయితే 2016లో టీ-20 ప్రపంచ కప్‌ పెట్టినప్పుడు కూడా ప్రభుత్వం నుంచి కూడా పన్ను మినహాయింపులనేవి లభించనే లేదు.దీంతో యూఏఈకి తరలించడం మంచిదని అభిప్రాయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.మరోవైపు చూస్తే కొత్త డెల్టా వేరియంట్ భారత్ లో రావడంతో ఎలాంటి రిస్క్‌ తీసుకోదలుచుకోలేనట్లుగా తెలుస్తోంది.ఐపీఎల్ ముగిసిన తర్వాత టీ-20 ప్రపంచ కప్ జరిగే అవకాశం ఉంది.

దీంతో ఆటగాళ్ల జర్నీకి ఇబ్బందులు ఉండవని బీసీసీఐ తెలుపుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube