ఆప్ సర్కార్‌కి చుక్కెదురు.. ఎన్ఆర్ఐ కోటాపై పిటిషన్‌ని కొట్టేసిన సుప్రీంకోర్ట్

పంజాబ్‌లోని మెడికల్ కాలేజీలలో నాన్ రెసిడెంట్ ఇండియన్ కోటాను( NRI Quota ) విస్తరించడాన్ని సుప్రీంకోర్టు( Supreme Court ) మంగళవారం ఖండించింది.ఇది ప్రతిభావంతులైన విద్యార్ధులను అడ్మిషన్ ప్రక్రియ నుంచి బయటికి నెట్టివేయడమేనని ధర్మాసనం పేర్కొంది.

 Supreme Court Junks Punjab Govt Plea Against Hc Verdict On Nri Quota Details, Su-TeluguStop.com

ఎన్ఆర్ఐ కోటా ప్రమాణాలను విస్తృతం చేయాలన్న పంజాబ్ ప్రభుత్వ చర్యను రద్దు చేస్తూ పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌లను సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్ కొట్టివేసింది.

ఇప్పుడు ఎన్ఆర్ఐ కోటా వ్యాపారాన్ని ఆపాలని.

ఇది పూర్తిగా మోసమని జస్టిస్ జేబీ పార్థివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది.మెరిట్ ఆధారిత అడ్మిషన్లను పక్కదారి పట్టించడానికి ఎన్ఆర్ఐ కోటాను దోపిడీ చేస్తున్నారని న్యాయమూర్తి పేర్కొన్నారు.

మూడు రెట్లకు పైగా ఎక్కువ స్కోర్లు సాధించిన విద్యార్ధులు ఓడిపోయారని.చట్టవిరుద్ధమైన అంశాలను ఎట్టి పరిస్ధితుల్లోనూ అనుమతించేది లేదని ధర్మాసనం స్పష్టం చేసింది.

ఈ మోసానికి ముగింపు పలకాలని, మూడు పిటిషన్లను కొట్టివేస్తున్నామని తెలిపింది.

Telugu Aap, Hc Verdict, Nri Medical, Nri Quota, Punjab Haryana, Punjab, Punjabme

కాగా.ఎన్ఆర్ఐ అభ్యర్ధికి ఇచ్చిన నిర్వచనాన్ని విస్తరిస్తూ పంజాబ్ ప్రభుత్వం( Punjab Government ) ఆగస్ట్ 20న నోటిఫికేషన్ ఇచ్చింది.దీని ప్రకారం ఎన్ఆర్ఐల దూరపు బంధువులు కూడా రాష్ట్రంలో సీట్లు పొందడానికి అర్హులేనని వెల్లడించింది.

రాష్ట్ర వైద్య సంస్థలకు అత్యధిక సంఖ్యలో ఎన్ఆర్ఐ విద్యార్ధులను ఆకర్షించేందుకు నోటిఫికేషన్‌లో పాక్షిక సవరణ చేసినట్లు డీఎంఈఆర్ కార్యదర్శి ప్రియాంక్ భారతి తెలిపారు.ఈ కేటగిరీ కింద మరిన్ని సీట్లను భర్తీ చేసేందుకు వీలుగా నోటిఫికేషన్‌లను సవరించాలని వైద్య కళాశాలలు,( Medical Colleges ) ప్రత్యేకించి ప్రైవేట్ విద్యాసంస్థలు రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నాయని డీఎంఈఆర్ వర్గాలు చెబుతున్నాయి.

Telugu Aap, Hc Verdict, Nri Medical, Nri Quota, Punjab Haryana, Punjab, Punjabme

అయితే దీనిపై పలువురు పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టును ఆశ్రయించడంతో న్యాయస్థానం ఈ నోటిఫికేషన్‌ను కొట్టివేసింది.ప్రభుత్వ మార్గదర్శకాలు దుర్వినియోగం అవుతాయని.నిజమైన ఎన్ఆర్ఐ విద్యార్ధులే దీని నుంచి ప్రయోజనం పొందాలని ధర్మాసనం తెలిపింది.అయితే పంజాబ్‌లోని ఆప్ సర్కార్, మరో ఇద్దరు ప్రైవేట్ వ్యక్తులు ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించగా.

హైకోర్టు తీర్పును అత్యున్నత న్యాయస్థానం సమర్ధించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube