ప్రస్తుతం చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడాల్లేకుండా అన్ని సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్నాయి.అయితే పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ప్రతి సినిమా హిట్టవుతుందా అనే ప్రశ్నకు అవుననే సమాధనం చెప్పలేం.
తెలుగులో హిట్టై ఇతర భాషల్లో ఫ్లాప్ రిజల్ట్ ను అందుకున్న సినిమాలు సైతం ఎక్కువ సంఖ్యలోనే ఉండటం గమనార్హం.పాన్ ఇండియా అంటే ప్రభాస్ ,బన్నీ రాజమౌళి( Prabhas, Bunny Rajamouli ) అనే స్థాయిలో వీళ్లకు గుర్తింపు దక్కింది.
అయితే జూనియర్ ఎన్టీఆర్ ( Junior NTR )ఆర్.ఆర్.ఆర్ తో హిట్ అందుకున్నా ఆ సక్సెస్ ను తారక్ ఖాతాలో వేయలేం.దేవర మూవీ( Devara movie ) బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిస్తే మాత్రమే హిందీ మార్కెట్ లో ఎన్టీఆర్ సత్తా ఏంటనే ప్రశ్నకు సంబంధించి జవాబు దొరికే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.
దేవర సినిమాకు ఇండస్ట్రీ టాక్ మాత్రం పాజిటివ్ గానే ఉందనే సంగతి తెలిసిందే.
దేవర సినిమాలో తారక్ డ్యూయల్ రోల్( Tarak dual role ) లో నటిస్తుండగా తండ్రీ కొడుకులుగా తారక్ నటించడంతో ఈ సినిమా రిజల్ట్ కోసం ఇండస్ట్రీ వర్గాలు సైతం ఒకింత ఆసక్తిగా ఎదురుచూస్తుండటం గమనార్హం.జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్( Janhvi Kapoor, Saif Ali Khan ) ఈ సినిమాతో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటారో చూడాల్సి ఉంది.దేవర సినిమాకు క్రిటిక్స్ నుంచి ఎలాంటి రియాక్షన్స్ వస్తాయనే చర్చ సైతం జరుగుతోంది.
దేవర1 సినిమాకు వాతావరణ పరిస్థితులు సైతం అనుకూలిస్తే కలెక్షన్ల పరంగా ఈ సినిమా రేంజ్ పెరిగే అవకాశాలు ఉంటాయి.కొరటాల శివ ఈ సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి వస్తారని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.దేవర1 ఓవర్సీస్ లో ఏకంగా ప్రీ సేల్స్ తో 2.5 మిలియన్ డాలర్ల కలెక్షన్లను సొంతం చేసుకుంది.దేవర1 జాతకం మరికొన్ని గంటల్లో బాక్సాఫీస్ వద్ద తేలిపోనుంది.