పూరి జగన్నాధ్ ఆఫర్ ని ఎస్ ఎస్ థమన్ ఎందుకు నిరాకరించాడు..ఆ తర్వాత ఏమైంది ?

ఇండస్ట్రీలో ఒక సినిమా హిట్ కావాలంటే హీరో, హీరోయిన్ తో పాటు ఆ సినిమాకి సంబంధించిన పాటలు కూడా బాగుండాలి.పాటలు బాగుండాలి అంటే ఆ సినిమా మ్యూజిక్ ముందుగా బాగుండాలి.

 Music Director S S Thaman Unknown Facts , S.s Thaman, Puri Jaganth, Boys, Bujjig-TeluguStop.com

ఒక సినిమా విజయం సాధించాలంటే అందులో దర్శకుల పాత్ర ఎంత ఉంటుందో, మ్యూజిక్ డైరెక్టర్ పాత్ర కూడా అంతే ఉంటుంది అని చెప్పొచ్చు.చాలామంది మ్యూజిక్ డైరెక్టర్లు వాళ్ళకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుని ఇండస్ట్రీలో చాలా కాలం పాటు కొనసాగారు అలాగే ప్రస్తుతం మ్యూజిక్ డైరెక్టర్లలో తమన్ కూడా తనదైన శైలిలో మ్యూజిక్ అందిస్తూ మంచి ఆదరణను పొందుతున్నారు.

తమన్ వాళ్ళ నాన్న ఘంటసాల శివ కుమార్ గారు మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి గారి దగ్గర డ్రమ్మర్ గా పని చేసేవారు.దాదాపు 700 చిత్రాలకు పైగా పని చేశారు.

అయితే తను మాత్రం మ్యూజిక్ డైరెక్టర్ కాలేకపోయాడు.అయితే చిన్న నాటి నుండే తమన్ వాళ్ళ ఇంట్లో ఉన్న డ్రమ్స్ వాయిస్తూ ఉండేవాడు, వాళ్ళ అమ్మ కూడా సింగర్ కావడం వల్ల ఒకరోజు ఆవిడ పాట పాడుతుంటే తమన్ డ్రమ్స్ వాయిస్తూ ఉన్నాడు, అది గమనించిన వాళ్ల నాన్న అతనికి చిన్నతనం నుంచే డ్రమ్స్ వాయించడం నేర్పించాడు.

అయితే కొన్ని రోజులకి తమన్ వాళ్ళ నాన్న చనిపోయారు దాంతో ఇంటి భారాన్ని మోయడానికి తమన్ డ్రమ్మర్ గా జాయిన్ అయ్యాడు.చాలా చోట్ల ప్రోగ్రాం లు చేస్తూ ఉండేవారు అలా కుటుంబాన్ని పోషిస్తూ వచ్చేవాడు అయితే అప్పటికే రాజ్ కోటి లాంటివారు ఇండస్ట్రీలో మంచి మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు.

వీళ్ల దగ్గర ఏ ఆర్ రెహమాన్,హరీష్ జయరాజ్, మణిశర్మ లాంటి వారు పనిచేసేవారు.అలాగే తను కూడా రాజ్ కోటి దగ్గర డ్రామ్మర్ గా జాయిన్ అయ్యారు.

అనతి కాలంలోనే రెహమాన్, హరీష్ జయరాజ్, మణిశర్మ లాంటి వారు మ్యూజిక్ డైరెక్టర్లు అయ్యారు.తను కూడా మంచి మ్యూజిక్ డైరెక్టర్ కావాలని కసితో వర్క్ చేసి ఎప్పటికప్పుడు మంచి మంచి ట్యూన్స్ చేసుకుంటూ తన ఆల్బంలో పెట్టుకున్నాడు అది గమనించిన సురేందర్ రెడ్డి కిక్కు సినిమాకి నువ్వే మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పేసరికి తనకి ఏం చేయాలో అర్థం కాలేదు సురేందర్ రెడ్డి గారు సడెన్ సర్ప్రైస్ ఇచ్చారు అని చెప్పాడు.

కిక్ సినిమా మంచి విజయం సాధించడంతో ఆ తర్వాత శ్రీను వైట్ల దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వచ్చిన దూకుడు సినిమాకి మ్యూజిక్ అందించి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోల అందరికీ మ్యూజిక్ ని అందించి తనదైన గుర్తింపుని చాటుకున్నాడు.

Telugu Bujjigadu, Music, Puri Jaganth, Thaman, Tollywood-Telugu Stop Exclusive T

అయితే ఒకానొక సందర్భంలో బాయ్స్ సినిమా లో డ్రమ్మర్ పాత్రకు గాను డైరెక్టర్ శంకర్ తమన్ తో ఒక పాత్ర చేయించాడు ఆ సినిమా విజయవంతం అవడంతో తమన్ కి నటుడిగా అవకాశాలు బాగా వచ్చాయి.అలాంటి సందర్భంలో నటుడిగా కొనసాగాలా లేదంటే మ్యూజిక్ డైరెక్టర్ గా మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించాలా అని తనకు తాను అనుకున్నప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ గానే కొనసాగాలి అంటే నటుడిగా వచ్చే అవకాశాలను వదులుకోవాలి అని అనుకున్నారు,నటుడిగా చాలా అవకాశాల్ని వదులుకున్నారు.అయితే తమన్ మ్యూజిక్ డైరెక్టర్ అవ్వకముందు పూరి జగన్నాథ్ బుజ్జిగాడు సినిమా తీస్తున్నప్పుడు తమన్ ని మ్యూజిక్ చేయమని అడిగితే అప్పుడు అతను నేను చేయను అని చెప్పారట, ఎందుకంటే అప్పటికి మ్యూజిక్ డైరెక్టర్ గా తను ఏ సినిమా చేయలేదు ఒక విధంగా చెప్పాలంటే ఆయనకు అప్పుడు పూర్తిగా తనమీద తనకి కాన్ఫిడెంట్ ఇంకా రాలేదు, అందుకోసమే చేయను అని చెప్పాడంట.దాంతో బిజినెస్ మ్యాన్ సినిమా కోసం మళ్ళీ పూరి జగన్నాథ్ సినిమా చేస్తావా లేదా అని అడిగితే చేస్తాను అని చెప్పి బిజినెస్ మ్యాన్ సినిమా చేశాడు ఆ సినిమా మంచి హిట్ సాధించింది.2020 లో అలా వైకుంఠపురం లో లాంటి సినిమాతో బెస్ట్ ఆల్బమ్ ను ఇచ్చాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube