సినిమాలంటే సగటు ప్రేక్షకుడికి ఎంత ఇష్టముంటుందో ఇక్కడ చెప్పాల్సిన పనిలేదు.ఎందుకంటే? మొత్తం ఇండియాలోనే ఎంటర్టైన్మెంట్ కి ఉన్న ఏకైక మార్గం సినిమా.ఇది తప్పితే వేరే మాధ్యమమే లేదు ఇక్కడ.అందుకే ఇక్కడ పాలిటిక్స్ తరువాత జనాలు ఎక్కవ మాట్లాడుకొనే టాపిక్ ఏదైనా ఉందంటే, అది సినిమానే.ఈ క్రమంలోనే తెలుగు చిత్ర పరిశ్రమ( Tollywood ) నేడు అంతర్జాతీయ స్థాయి సినిమాలను తీస్తోంది.రెండు దశాబ్దాల కిందటి వరకు తెలుగు భాష సినిమా ఒకటుంది.
అనే విషయమే ఈ ప్రపంచానికి తెలియదు.అలాంటిది బాహుబలి సినిమాతో దర్శక ధీరుడు రాజమౌళి తెలుగు సినిమాని గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లాడు.
అయితే ఇపుడు ఇక్కడ తెలుగు సినిమా ఏ స్థాయిలో ఉన్నది కాదు చర్చ.సినిమా హీరోలు, దర్శకులు గురించి.ప్రస్తుతం హీరో ముఖంతోనే నిర్మాతలు కోట్ల రూపాయిలు ఇక్కడ పెట్టుబడిగా పెడతారు.కాబట్టి సో కాల్డ్ సినిమా దర్శకులు ఆయా సినిమాలపై బాధ్యత వహించాల్సి ఉంటుంది.కేవలం హీరోనే హైలైట్ చేసి… కధ, స్క్రీన్ప్లే పక్కకు తోసేస్తే, సదరు నిర్మాతలు అడుక్కు తినాల్సిందే.ఇలాంటి పరిస్థితులు మన తెలుగు పరిశ్రమలో అనేకమంది ఎదుర్కొన్నారు.
కేవలం హీరోల బిల్డప్ తో తెరకెక్కి, కధను పక్కన పెట్టిన అనేక సినిమాలు అట్టర్ ప్లాప్స్ గా మిగిలిపోయాయి.
ఆ లిస్టులో హీరో రవితేజ “ఖతర్నాక్” సినిమా( Khatarnak Movie ) మొదటి స్థానంలో ఉంటుంది.2006లో వచ్చిన ఈ సినిమా కేవలం రవితేజ( Ravi Teja ) బిల్డప్ తోనే తెరకెక్కించారు సదరు దర్శక నిర్మాతలు.కట్ చేస్తే, సినిమా ప్లాప్ అవ్వగా, ఆఖరికి అనేక విమర్శలకు నోచుకుంది.
ఈ కోవకు చెందిందే పవన్ కళ్యాణ్ “బాలు” సినిమా.( Balu Movie ) ఈ సినిమా కూడా కధ తక్కువ బిల్డప్ ఎక్కువ అన్న మాదిరి ఉండడంతో ప్రేక్షకులు తిప్పికొట్టారు.
ఇక మెగాస్టార్ సినిమాలోనే డిజాస్టర్ అయినటువంటి “అంజి” సినిమా( Anji ) కూడా ఈ కోవకు చెందిందే.
విక్టరీ వెంకటేష్ సినిమా “నాగవల్లి”( Nagavalli Movie ) సినిమాలో కూడా విషయం తక్కువ, బిల్డప్ ఎక్కువగా ఉంటుంది.దాంతోనే ఈ సినిమా వెంకీ కెరీర్లోనే భారీ డిజాస్టర్ గా మిగిలింది.ఇక జూనియర్ ఎన్టీఆర్ నటించిన “శక్తి, ఆంధ్రావాలా” గురించి చెప్పాల్సిన పనిలేదు.
అదేవిధంగా రామ్ చరణ్ నటించిన “నాయక్” సినిమా గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.ఇక ఇలా చెప్పుకుంటూ పొతే, ఆ లిస్ట్ భారీగానే ఉంటుంది గానీ, మీకు తెలిసిన సినిమాల గురించి ఇక్కడ కామెంట్ చెయ్యండి.