అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్( US President Donald Trump ) బాధ్యతలు స్వీకరించిన అనంతరం అక్కడి వ్యవస్ధలో అనేక సంస్కరణలు వస్తున్నాయి.సీఎన్ఎన్ వర్గాల సమాచారం ప్రకారం .
సోమవారం నాటికి పదవీ విరమణ లేదా రాజీనామా చేయాలని లేదా డిమోషన్ ఎదుర్కోవాలని అనేక మంది సీనియర్ ఎఫ్‌బీఐ అధికారులకు( Senior FBI Officers ) ఆదేశాలు జారీ చేయబడ్డాయి.సైబర్, జాతీయ భద్రత, నేర పరిశోధనలు వంటి కీలక రంగాలను పర్యవేక్షించే ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ డైరెక్టర్లు, ఇన్‌ఛార్జ్ స్పెషల్ ఏజెంట్లు వంటి ఉన్నత స్థాయి అధికారులను ఈ తాజా ఆదేశం ప్రభావితం చేస్తుందని నిపుణులు పేర్కొన్నారు.

ట్రంప్ ఫోకస్ చేసిన ఆరుగురు అధికారులు ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ డైరెక్టర్లని , వీరు ఎఫ్‌బీఐ( FBI ) అత్యున్నత స్థాయి మేనేజర్లలో ఉన్నారని మీడియా వర్గాలు తెలిపాయి.వీరిలో చాలా మందికి మాజీ ఎఫ్‌బీఐ డైరెక్టర్ క్రిస్టోఫర్ వ్రే( Ex FBI Director Christopher Wray ) పదోన్నతి కల్పించారు.వీరందరినీ గురువారం నాటికి రాజీనామా లేదా పదవీ విరమణ చేయాల్సిందిగా ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెళ్లినట్లుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి.

ఎఫ్‌బీఐ ప్రధాన కార్యాలయానికి సమీపంలో ఉన్న న్యాయశాఖలో గత వారం ప్రారంభమైన ప్రక్షాళన తాజా చర్య మరింత పెంచింది.జనవరి 6న జరిగిన కాపిటల్ దాడి, డొనాల్డ్ ట్రంప్ రహస్య పత్రాలను దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై దర్యాప్తులో పనిచేస్తున్న ఏజెంట్ల నుంచి ఎఫ్‌బీఐ అధికారుల వరకు పలు నాయకత్వ మార్పులు చోటు చేసుకున్నాయి.న్యాయశాఖలోని అటార్నీలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల దృష్ట్యా.
ఎఫ్‌బీఐ ఏజెంట్లలోని చాలా మంది ఇప్పుడు శిక్షను ఎదుర్కోవడమో లేదంటే బలవంతంగా బయటికి పంపేస్తారేమోనని భయపడుతున్నారు.
జనవరి 6 ఘటన, తన వ్యక్తిగత కేసు దర్యాప్తులో పాల్గొన్న ఎఫ్‌బీఐ ఏజెంట్లను ట్రంప్ లక్ష్యంగా చేసుకున్నారు.
పలుమార్లు ఏజెంట్లపై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.మరోవైపు.సిబ్బంది మార్పులపై వ్యాఖ్యానించడానికి ఎఫ్‌బీఐ నిరాకరించింది.2017లో అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ట్రంప్ నియమించిన క్రిస్టోఫర్ వ్రే బైడెన్ హయాంలో రాజీనామా చేశారు.