టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) చివరగా దేవర( Devara ) మూవీ తో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.ఈ సినిమాతో మరో సూపర్ హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకున్నారు జూనియర్ ఎన్టీఆర్.
రాజమౌళి సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ హిట్టు కొట్టి బ్యాడ్ సెంటిమెంట్ ను కూడా బ్రేక్ చేయడంతో ఎన్టీఆర్ అభిమానులు గర్వంగా కాలర్ ఎగరేసుకుంటున్నారు.ఇకపోతే ఎన్టీఆర్ ప్రస్తుతం హృతిక్ రోషన్ నటిస్తున్న బాలీవుడ్ మూవీ వార్ 2( War 2 ) లో నటిస్తున్న విషయం తెలిసిందే.

ఈ సినిమాతో ఎలా అయినా మంచి సక్సెస్ ను సాధించాలని చూస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్.హృతిక్ రోషన్( Hrithik Roshan ) లాంటి హీరో ఎదురుగా ఉన్నా తారక్ ను తక్కువగా అంచనా వేయడానికి లేదు.వార్ 2 సినిమాలో హృతిక్ రోషన్ కంటే జూనియర్ ఎన్టీఆర్ క్యారెక్టర్ మరింత ఛాలెంజింగ్ గా ఉంటుందని తెలుస్తోంది.కబీర్ గా ఇప్పటికే వార్ ఫ్రాంచైజీలో హృతిక్ క్యారెక్టర్ పై ఒక క్లారిటీ ఉంది.
కానీ తారక్ పాత్రపై మాత్రం క్లారిటీ లేదు.ఇందులో ఎన్టీఆర్ క్యారెక్టర్ నెగిటివ్ షేడ్‌తో ఉండబోతుందని తెలుస్తోంది.
గతంలో జై లవకుశలో తారక్ ఈ తరహా పాత్ర చేసారు.

వార్ 2 లో దేశం కోసం ప్రాణాలిచ్చే సైనికుడిగా ఉన్న తారక్ ఆ తర్వాత ఎందుకు నెగిటివ్ షేడ్స్ లోకి మారిపోయారనేది ఆసక్తికరంగా ఉండబోతుందని సమాచారం.వార్ లోనూ టైగర్ ష్రాఫ్( Tiger Shroff ) పాత్ర ముందు హీరోగా ఉండి చివరికి నెగిటివ్ షేడ్ లోకి మారుతుందట.వార్ 2లోనూ ఇదే ఫార్ములా అప్లై చేస్తున్నట్లు తెలుస్తోంది.
మరి ఈ సినిమాలో ఎన్టీఆర్ ఎలాంటి పాత్రలో నటిస్తున్నారు? ఆ పాత్ర ఎలా ఉండబోతోంది అన్న విషయాలు తెలియాలి అంటే మరికొన్ని రోజులు వచ్చి చూడాల్సిందే.ఈ సినిమాతో పాటు ఎన్టీఆర్ మరికొన్ని సినిమాలలో కూడా నటిస్తున్న విషయం తెలిసిందే.