ఆకాష్ మురళి, అతిథి శంకర్ కలిసి నటించిన తాజా చిత్రం ప్రేమిస్తావా.( Premistava ) ఈ సినిమాకు విష్ణువర్ధన్( Director Vishnu Vardhan ) దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.రొమాంటిక్ యాక్షన్ త్రిల్లర్ గా ఈ సినిమా రూపొందింది.అయితే ఇప్పటికే సంక్రాంతి పండుగ కానుకగా తమిళంలో నేసిప్పాయా అనే పేరుతో విడుదల అయ్యి మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే.
తమిళంలో విడుదల అయ్యి మంచి సక్సెస్ను సాధించడంతో ఈ సినిమాను తెలుగులో విడుదల చేసేందుకు మైత్రి మూవీ మేకర్స్ ముందుకొచ్చింది.తాజాగా జనవరి 30వ తేదీన ఈ సినిమాను రెండు తెలుగు రాష్ట్రాలలో విడుదల చేశారు.
ప్రేమజంట మధ్య లవ్, రిలేషన్ షిప్, గొడవలు నేపథ్యంలో ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.

అయితే ఈ సినిమా విడుదల సందర్భంగా తాజాగా డైరెక్టర్ విష్ణువర్ధన్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా డైరెక్టర్ విష్ణు వర్ధన్ మాట్లాడుతూ.
మహేశ్ బాబుతో( Mahesh Babu ) చాలా అనుబంధం ఉంది.ఎందుకంటే మేమిద్దరం బెంచ్ మేట్స్.
( Benchmates ) ఆయనతో చాలా మధురమైన, సరదా క్షణాలు ఉన్నాయి.కొన్నింటిని బయటికే చెప్పలేము.
మేము చెన్నై లో చదివే రోజుల్లో నేను చాలా యావరేజ్ స్టూడెంట్.బిలో యావరేజ్ అనుకోండి.
మహేశ్ బాబుకు తెలుగుతో పాటు తమిళం కూడా బాగా మాట్లాడతాడు.

ఒక ఏరియాలో ప్రశ్న పత్రం అమ్ముతున్నారని కొందరు చెప్పారు.ఈ విషయం మహేశ్ బాబుతో చెప్పాను.నేను వెంటనే మహేశ్ బాబును లాక్కొని అక్కడికి తీసుకెళ్లాను.
కానీ అక్కడకు వెళ్తే మా డబ్బులు పోయాయి కానీ క్వశ్చన్ పేపర్ అయితే దొరకలేదు.అన్నీ ఫేక్.
మహేశ్ బాబు నటించిన చిత్రాల్లో ఒక్కడు సినిమా అంటే నాకు చాలా ఇష్టం.భవిష్యత్తులో ఛాన్స్ వస్తే మహేశ్ బాబుతో సినిమా తీస్తాను అని ఆ నాటి రోజులను గుర్తు చేసుకున్నారు డైరెక్టర్ విష్ణువర్ధన్.
ఈ మేరకు ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.