తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న దర్శకులందరు వాళ్ళ కంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడానికి స్టార్ హీరోలతో సినిమాలు చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నారు.నిజానికి మీడియం హీరోలతో సినిమాలను చేసి సూపర్ సక్సెస్ లను అందుకున్న ప్రతి దర్శకుడు స్టార్ డైరెక్టర్ గా మారిపోయి స్టార్ హీరో ను డైరెక్షన్ చేయడమే లక్ష్యం గా పెట్టుకొని ముందుకు దూసుకెళుతున్నారు.
ఇక అందులో భాగంగానే శ్రీకాంత్ ఓదెల( Srikanth Odela ) లాంటి దర్శకుడు సైతం దసరా సినిమాతో( Dasara Movie ) సూపర్ సక్సెస్ ని సాధించి ఆ తర్వాత నానితో( Nani ) మరో సినిమా చేస్తున్నాడు.

ఇక దాంతో పాటుగా చిరంజీవితో( Chiranjeevi ) కూడా ఒక సినిమా చేయబోతున్నాడనే అనౌన్స్ మెంట్ అయితే వచ్చింది.చిరంజీవి కూడా దానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ సినిమా 2026 సమ్మర్ లో తెరకెక్కబోతున్నట్టుగా తెలుస్తోంది.మరి ఏది ఏమైనా కూడా చిరంజీవి ఈ సినిమాను చేస్తే మాత్రం ఆయనకు మంచి గుర్తింపైతే వస్తుంది.
అంటూ కొంతమంది భావిస్తుంటే శ్రీకాంత్ ఓదెల చిరంజీవి అభిమాని కావడం వల్ల ఆయన ను ఏ రేంజ్ లో చూపిస్తాడనేది కూడా తెలియాల్సి ఉంది అంటూ మరి కొంతమంది కొన్ని కామెంట్స్ అయితే చేస్తున్నారు.

మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో చిరంజీవి మరోసారి భారీ క్రేజ్ ను క్రియేట్ చేసుకుంటాడా? శ్రీకాంత్ ఓదెలా ఈ సినిమాతో స్టార్ డైరెక్టర్ గా మారతాడా అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.మరి ఏది ఏమైనా కూడా శ్రీకాంత్ ఓదెల లాంటి దర్శకుడు స్టార్ డైరెక్టర్ గా మారాలంటే మాత్రం ఇది తనకు చాలా చక్కటి అవకాశమనే చెప్పాలి.మరి తనను తాను ప్రూవ్ చేసుకొని స్టార్ట్ డైరెక్టర్ గా ఎదుగుతాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…
.