చలికాలంలో( Winter ) ఆహారం వేడిగా ఉంచడం మహా కష్టం, మరీ ముఖ్యంగా కెనడా( Canada ) లాంటి అతి శీతల ప్రదేశాల్లో అయితే ఫుడ్ వెంటనే చల్లబడిపోతుంది.కానీ భారతీయ తల్లులు( Indian Moms ) మాత్రం ఎప్పుడూ సింపుల్ అండ్ స్మార్ట్ సొల్యూషన్స్ కనిపెడతారు.
ఇటీవల ఒక జంట ఇన్‌స్టాలో ఒక వీడియో షేర్ చేశారు.అందులో, “కెనడా చలిలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆహారం వేడిగా ఎలా ఉంచాలి?” అని ఆ అమ్మాయి అడుగుతుంది.సమాధానం చాలా సింపుల్, ఒక థర్మోస్ అని చెబుతాడు.
వీడియోలో ఆ వ్యక్తి థర్మోస్( Thermos ) తెరిచి, అల్యూమినియం ఫాయిల్ లో చుట్టిన పరాటాలు తీస్తాడు.-14°C డిగ్రీల చలిలో కూడా ఆ పరాటాల నుంచి ఆవిరి వస్తూనే ఉంది.వెంటనే ఆ అమ్మాయి “కెనడాలో మా అమ్మానాన్నల ట్రిక్స్!” అంటూ మురిసిపోయింది.“మా దేశీ అమ్మలా ఎవరూ ఉండలేరు” అనే క్యాప్షన్ తో పెట్టిన ఈ వీడియో క్షణాల్లో వైరల్( Viral Video ) అయిపోయింది.ఏకంగా 40 లక్షల వ్యూస్ తో దూసుకెళ్తోంది.
చాలా మందికి ఈ ఐడియా తెగ నచ్చేసింది, తాము కూడా ట్రై చేస్తామంటూ కామెంట్స్ పెట్టారు.
“ఇది ఎలా సాధ్యం?” అని ఒక నెటిజన్ అడిగితే, క్రియేటర్ “మేం పరాటాలని థర్మోస్ లో పెట్టాం.అది ఇన్సులేటెడ్ కాబట్టి, వేడిని అలాగే ఉంచింది.అందుకే తెరిచేసరికి పరాటాలు ఇంకా వేడి వేడిగా ఆవిరి కక్కుతూ ఉన్నాయి!” అని రిప్లై ఇచ్చారు
ఇంకా చాలామంది తమ సొంత టిప్స్ కూడా షేర్ చేశారు.ఒక యూజర్ “వావ్, చాలా మంచి ఐడియా.మా అమ్మాయి లంచ్ బాక్స్ కోసం నేను కూడా ఇదే వాడతా” అని కామెంట్ పెట్టారు.
మరొకరు “నేను ఎప్పుడూ శాండ్విచ్ ని పెద్ద కాఫీ మగ్ లో పెడతాను.బ్యాగ్ లో స్పేస్ కూడా సేవ్ అవుతుంది.” అని అన్నారు.
ఇంకొక నెటిజన్ అయితే ఒక అడుగు ముందుకేసి “మా అమ్మ 1979 నుంచి మా నాన్న రోటీలు ఇలాగే ప్యాక్ చేస్తోంది!” అని కామెంట్ పెట్టారు.
ఈ సింపుల్ కానీ సూపర్ స్మార్ట్ ట్రిక్ చూస్తే అర్ధమవుతుంది, ఎంత చలి ఉన్నా సరే, దేశీ పేరెంట్స్ మాత్రం జీవితాన్ని సులువు చేయడానికి ఎప్పుడూ ఏదో ఒక దారి కనిపెడతారని అర్థమవుతుంది.