డైరెక్టర్ చందు మొండేటి( Chandoo Mondeti ) దర్శకత్వంలో నాగచైతన్య( Naga Chaitanya ) సాయి పల్లవి( Sai Pallavi ) కలిసి నటించిన తాజా చిత్రం తండేల్.( Thandel ) ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి చాలా రకాల అప్డేట్లను విడుదల చేశారు మూవీ మేకర్స్.ఈ అప్డేట్లు సినిమాపై అంజనాలను భారీగా పెంచేసాయి.
పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కాబోతున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.శ్రీకాకుళం జిల్లా డి.మత్స్యలేశం గ్రామంలో చోటుచేసుకున్న సంఘటనల ఆధారంగా రూపొందిన చిత్రమిది.

వేటకు వెళ్లిన పలువురు మత్స్యకారులు పాకిస్థాన్ కోస్ట్ గార్డుకు చిక్కి రెండేళ్లు జైలు శిక్ష అనుభవించిన వృత్తాంతాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు.సినిమా ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సందర్భంగా మూవీ మేకర్స్ ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాల్లో భాగంగా బిజీబిజీగా ఉన్నారు.
ఈ ప్రమోషన్స్ లో భాగంగా డైరెక్టర్ చందు మొండేటి మాట్లాడుతూ.నా గత చిత్రం కార్తికేయ 2 అనుభవం తండేల్ సినిమాకు బాగా ఉపయోగపడింది.నేను ఎప్పుడూ అనుకున్న బడ్జెట్ ను దాటి సినిమా చేయను.ఈ మూవీ విషయానికొస్తే రీసెర్చ్ అనంతరం కథ రాయడం పూర్తయింది.
తర్వాత హీరో బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటే బాగుంటుందో టెస్ట్ చేసేందుకు మళ్లీ డి.మత్స్యలేశం వెళ్లాము అని తెలిపారు.

అప్పటికే పూర్తయిన కథకు తగ్గట్టు బడ్జెట్ ఫిక్స్ అయిపోయినా ఇలాంటి విజువల్స్ ఉంటే బాగుంటుందని భావించాను.అదే విషయం చెబితే నిర్మాతలు అంగీకరించారు.ఆ ఒక్క ఎపిసోడ్ కే రూ.18 కోట్లు బడ్జెట్ అయింది.లైవ్ లొకేషన్ లో, స్టూడియోలో, మినియేచర్, వర్చువల్ గా సన్నివేశాలు చిత్రీకరించాము.ఇందులో ఎమోషన్ ఉంటుంది అని చెప్పుకొచ్చారు.ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.ఒక ఎపిసోడ్ కి 18 కోట్లు ఖర్చు పెట్టారు అంటే ఆ ఎపిసోడ్ ఎలా ఉండబోతోంది? ఇంతకీ ఆ సన్నివేశం ఎప్పుడు వస్తుంది అన్న విషయాల గురించి చర్చించుకుంటున్నారు అభిమానులు.