ఈ మ్యాజికల్ హోమ్ మేడ్ జెల్ ను వాడితే క్లియర్ అండ్ గ్లోయింగ్ స్కిన్ మీ సొంతం!

మచ్చలేని మెరిసే చర్మాన్ని పొందాలని చాలామంది భావిస్తుంటారు.అందుకోసం తోచిన చిట్కాలు ప్రయత్నిస్తుంటారు.

 You Can Get Clear And Glowing Skin If You Use This Homemade Gel, Homemade Gel, H-TeluguStop.com

కానీ ఎన్ని చేసినా సరే చర్మంపై ఏదో ఒక కారణంగా మచ్చలు పడుతుంటాయి.అవి ముఖంలో కాంతిని తగ్గిస్తాయి.

దాంతో తెగ హైరానా పడిపోతుంటారు.మీరు ఈ లిస్టులో ఉన్నారా? అయితే డోంట్ వర్రీ ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే మ్యాజికల్ హోమ్ మేడ్ జెల్( Magical Homemade Gel ) ను వాడితే క్లియర్ అండ్ గ్లోయింగ్ స్కిన్ మీ సొంతం అవ్వడం ఖాయం.ఈ జెల్ మచ్చలను తొలగించడమే కాదు చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది.అదే సమయంలో మరిన్ని బెనిఫిట్స్ ను అందిస్తుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ జెల్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది ఓ చూపు చూసేయండి.

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల రోజ్ వాటర్ ( Rose water )ను వేసుకోవాలి.

అలాగే వన్ టేబుల్ స్పూన్ ( Glycerin ), మూడు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్( Aloe vera gel ) వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.చివరిగా వన్ టేబుల్ స్పూన్ వైల్డ్ టర్మరిక్ పౌడర్ వేసి మరోసారి బాగా కలిపితే మన హోమ్ మేడ్ హల్దీ జెల్ సిద్ధం అయినట్టే.

ఈ హోమ్ మేడ్ జెల్ ను ఒక బాక్స్ లో నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.రోజు నైట్ నిద్రించే ముందు ముఖానికి ఏమైనా మేకప్ ఉంటే తొల‌గించి వాటర్ తో శుభ్రంగా కడగాలి.ఆ తర్వాత తయారు చేసుకున్న జెల్ ను ముఖానికి అప్లై చేసుకోవాలి.రోజు ఈ జెల్ ను వాడితే ఎలాంటి మచ్చలైన తొలగిపోతాయి.

ముఖ‌ చర్మం కాంతివంతంగా మారుతుంది.మొటిమలు దూరం అవుతాయి.చర్మం మృదువుగా మరియు కోమలంగా మారుతుంది.డార్క్ సర్కిల్స్ సమస్యను నివారించడానికి కూడా ఈ జెల్ అద్భుతంగా సహాయపడుతుంది.కాబట్టి క్లియర్ అండ్ గ్లోయింగ్ స్కిన్ ను పొందాలనుకునే వారు తప్పకుండా ఈ జెల్ ను ప్రిపేర్ చేసుకుని వాడేందుకు ప్రయత్నించండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube