గతంలో ఇప్పటంత స్థాయిలో టెక్నాలజీ లేకపోవడం మూలంగా చాలా కాలం పాటు షూటింగులు జరుపుకునేవి.అంతే సమయం పాటు ఎడిటింగ్ కార్యక్రమాలు జరిగేవి.
సినిమా మొదలైన ఎప్పటికోగానీ రిలీజ్ అయ్యేది కాదు.కానీ ప్రస్తుతం సినిమా నిర్మాణంలో వేగం గణనీయంగా పెరిగింది.
కేవలం రోజుల్లోనే సినిమాలను తెరకెక్కిస్తున్నారు.అయినా కొందరు హీరోలు రెండు సినిమాలకు నడుమ భారీ గ్యాప్ తీసుకున్న వారు ఉన్నారు.
ఉదాహరణకు అతిథి సినిమా తర్వాత మూడేళ్లకు మహేష్ బాబు మరో సినిమా చేశాడు.ప్రభాస్ కూడా బాహుబలి తర్వాత చాలా రోజులకు సాహో సినిమా చేశాడు.
తాజాగా ప్రభాస్ చేస్తున్న సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయో చెప్పడం కష్టం.కొందరు హీరోలు సినిమాలు షూటింగ్ లో ఎక్కువ సమయం తీసుకోవడం మూలంగా లేట్ అయితే.
మరికొందరు సరైన కథ దొరక్క లేటైన సంఘటనలు ఉన్నాయి.ఇలా సినిమాకు సినిమాకు మధ్య భారీగా గ్యాప్ తీసుకున్న హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం.
*మహేష్ బాబు
అతిథి(2007) – ఖలేజా(2010) – 1085 రోజులు
* రవితేజ

బెంగాల్ టైగర్(2015)- రాజా ది గ్రేట్ (2017) – 678 రోజులు
*రామ్ పోతినేని

మసాలా (2013)- పండగ చేస్కో(2015) – 561 రోజులు
*రామ్ చరణ్

చిరుత( 2007)- మగధీర (2009)- 672 రోజులు
*ప్రభాస్

బాహుబలి(2017)- సాహో (2019)- 855 రోజులు
*పవన్ కల్యాణ్

జల్సా(2008) – కొమురం పులి (2010)- 891 రోజులు
* కల్యాణ్ రామ్

కత్తి (2010) – ఓం (2013) – 980 రోజులు
* జూనియర్ ఎన్టీఆర్

కంత్రి (2008)- అదుర్స్ (2010) – 614 రోజులు
*అల్లు అర్జున్

నా పేరు సూర్య(2018)- అల వైకుంఠ పురంలో (2020) – 618 రోజులు
వీరితో పాటు పలువురు నటీనటులు రెండు సినిమాకు నడుమన చాలా గ్యాప్ తీసుకున్నారు.అయితే లాంగ్ గ్యాప్ తీసుకున్న తర్వాత వచ్చిన సినిమాలు కొన్ని హిట్ అయితే.మరికొన్ని ఫట్ అయ్యాయి కూడా.